Flipkart Republic Day Sale: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్.. భారీ డిస్కౌంట్లు..
ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందించబోతుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్, ఫ్రిజ్జులు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్లు, డ్రెస్సులు, వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు, ఆఫర్లు ఉంటాయి.

Flipkart Republic Day Sale: పండుగల సందర్భంగా ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్ భారీ డిస్కౌంట్లతో సేల్ నిర్వహిస్తాయనే సంగతి తెలిసిందే. సంక్రాంతి, రిపబ్లిక్ డేలను పురస్కరించుకుని.. లీడింగ్ షాపింగ్ యాప్ అయిన ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌కు రెడీ అవుతోంది. ఈ నెల 14 నుంచి 19 వరకు రిపబ్లిక్ డే 2024 సేల్ నిర్వహిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు మాత్రం ఒకరోజు ముందుగానే సేల్ అందుబాటులో ఉంటుంది.
Vijay Sethupathi: రామ్ చరణ్‌కు హ్యాండిచ్చిన కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి
ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందించబోతుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్, ఫ్రిజ్జులు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్లు, డ్రెస్సులు, వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు, ఆఫర్లు ఉంటాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై ప్రత్యేక తగ్గింపులు కూడా ఇవ్వబోతుంది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్‌లో టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, పరుపులపై 80 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులు, దుస్తులపై 50-80 శాతం, ఎయిర్ కండీషనర్‌లపై 55 శాతం, వాషింగ్ మెషిన్లు, మిక్సర్లపై 75 శాతం, బ్యూటీ ప్రోడక్ట్‌లపై 85 శాతం వరకు తగ్గింపులు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అలాగే యాపిల్, శామ్‌సంగ్, రెడ్‌మి, రియల్‌మీ వంటి టాప్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లను అతి తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12 వంటి ఆపిల్ డివైజ్‌లతో పాటు, పలు ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభించనుంది. అమెజాన్ కూడా ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను ఒకరోజు ముందుగానే.. అంటే జనవరి 13 నుంచే ప్రారంభించబోతుంది. ఎస్బీఐ కార్డుపై పది శాతం వరకు డిస్కౌంట్ అందించనుంది. మొత్తంగా ఈ సేల్స్ సందర్భంగా బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు, ధరల తగ్గింపు భారీగా ఉండనున్నాయి.