పడవ తీయడానికి కొత్త ప్రాసెస్, ఇప్పుడేం చేస్తున్నారు
విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. కట్ అయిన బోట్ ను 20 మీటర్లకు ముందుకు లాగిన సిబ్బంది. మరో 20 మీటర్లు ముందుకు లాగిన తర్వాత కొత్త విధాన అమలు చేయనున్నారు.
విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. కట్ అయిన బోట్ ను 20 మీటర్లకు ముందుకు లాగిన సిబ్బంది. మరో 20 మీటర్లు ముందుకు లాగిన తర్వాత కొత్త విధాన అమలు చేయనున్నారు. రెండు పడవల సహాయంతో కట్ అయిన బోట్ ను లాక్ చేస్తారు. తరువాత రెండు పడవలలో నీటిని నింపి కింద పడవను లాక్ చేస్తారు. లాక్ అయిన తరువాత రెండు పడవలలో నీటిని తోడతారు. లాక్ అయిన బోట్ పైకి వచ్చిన తర్వాత బయటకు లాగుతారు.
ఈరోజు కట్ అయిన బోట్ ని బయటకు తీస్తామంటున్న అబులు టీం.. అన్ని బోట్లు తీయటానికి నాలుగు రోజులు పైనే పడుతుంది అని చెప్తున్నారు. నిన్న బోట్లు మట్టిలో కూరుకుపోవడంతో ప్రక్రియను నిలిపివేసారు. వైజాగ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం అయింది.