East Africa, Flood : తూర్పు ఆఫ్రికా దేశంలో వరద బీభత్సం.. 155 మంది మృతి
తూర్పు ఆఫ్రికా (East Africa) దేశాలైన టాంజానియా(Tanzania), కెన్యా (Kenya), బురుండీల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
తూర్పు ఆఫ్రికా (East Africa) దేశాలైన టాంజానియా(Tanzania), కెన్యా (Kenya), బురుండీల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధాన నదులు పొంగి పొర్లుతుండటంతో.. ఆ వరద నీరంతా గ్రామాల్లోకి పోటెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్ని నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగి స్తున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 60 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. వర్షాల ధాటికి ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు కెన్యా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు.
వరదలపై టాంజానియా ప్రధాని కాసిమ్ మజాలివా (Kasim Majaliwa) మాట్లాడుతూ.. పెను గాలులు, వరదల కారణంగా తమ దేశంలో పలు ప్రాంతాలు, పంటలు, వంతెనలు, ఆ దేశ రైలు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. భారీ వర్షాలు దేశవ్యాప్తంగా కనీసం 23 కౌంటీలను ప్రభావితం చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కెన్యా వాతావరణ విభాగం అంచనా వేసింది. కాగా ఈ వదరలకు 155 మంది ప్రాణాలు కోల్పోయారని, 236 మంది గాయపడ్డారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
గతేడాది చివర్లో కెన్యా, సోమాలియా, ఇథియోపియాలో కుండపోత వర్షాలు మరియు వరదల కారణంగా 300 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే. ఇక అక్టోబర్ 1997 నుండి జనవరి 1998 వరకు భారీ వరదలు ఈ ప్రాంతంలోని ఐదు దేశాలలో 6వేల కంటే ఎక్కువ మందిని పొట్టన బెట్టుకున్నాయి.
SSM..