Swiggy: ఫుడ్ పెట్టే స్విగ్గీ క్రెడిట్ కార్డ్.. దీంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి తమ ఇంటికి, ఒంటికి కావల్సిన వస్తువులను ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అందులో కడుపు నింపే యాప్స్ కూడా అరడజను పైగానే ఉన్నాయి. వాటిలో పేరుపొందింది స్విగ్గీ. తాజాగా ఈ ఫుడ్ డెలివరీ యాప్ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ అయిన ఎచ్ డి ఎఫ్ సి తో చేతులు కలిపి ఒక క్రెడిట్ కార్డును రూపొందించారు. గతంలో జొమాటో కూడా ఆర్బీఎల్ బ్యాంకు సహకారంతో ఇలాంటి క్రెడిట్ కార్డును తీసుకొని వచ్చింది. కొన్నిరోజులకు దీనిని నిలిపి వేసింది. అయితే తాజాగా స్విగ్గీ తీసుకొచ్చే క్రెడిట్ కార్డ్ ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 26, 2023 | 07:58 PMLast Updated on: Jul 26, 2023 | 7:58 PM

Food Delivery App Swiggy In Partnership With Hdfc To Launch Co Branded Credit Card

ఆకలి తీర్చే స్విగ్గీ యాప్ ఇప్పుడు కాసులు మిగిలించే పని చేయబోతుంది. దీనికి ఎచ్ డీ ఎఫ్ సీ ప్రైవేట్ బ్యాంక్ ను భాగస్వామిగా చేసుకుంది. వీరిద్దరూ కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ను వినియోగదారులకు అందించనున్నారు. ఈ కార్డ్ మాస్టర్ కార్డ్ పేమెంట్స్ నెట్వర్క్ పై పనిచేస్తుంది. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టినా.. ఇంటికి కావల్సిన ఉప్పు, పప్పు వంటి నిత్యవసరాలు కొనుగోలు చేసినా మొత్తం విలువపై 10శాతం క్యాష్ బ్యాక్ లభించేలా సరికొత్త ఆఫర్స్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాట్ ఫాంపై కాకుండా ఇతర యాప్స్ ద్వారా ఈ కార్డును ఉపయోగిస్తే రివార్డ్, బోనస్ పాయింట్స్ లభిస్తాయి. ఇలాంటి అద్భుత ప్రయోజనాలను అందించే కార్డ్ ను తొట్టతొలిసారిగా తీసుకొచ్చింది స్విగ్గీయే అని చెప్పాలి.

ఒక్కో యాప్ కి ఒక్కో రకమైన బెనిఫిట్..
ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఉపయోగించి స్విగ్గిలో ఫుడ్, గ్రాసరీ, డైనౌట్ కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్రా, నైకా, ఓలా, ఉబర్, ఫార్మాఈజీ, నెట్ మెడ్స్, బుక్ మై షో వంటి వేదికలపై జరిపే లావీదేవీల్లో 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. పైన తెలిపిన వేదికల్లో కాకుండా ఇతర మాధ్యమాల ద్వారా ఏవైనా కొనుగోలు జరిపితే 1శాతం క్యాష్ బ్యాక్ వచ్చేలా దీనిని రూపొందించారు. ఈ నగదు మొత్తం మన బ్యాంక్ అకౌంట్లో కాకుండా స్విగ్గీ మనీలో క్రెడిట్ అవుతుంది. దీనిని ఇతర లావాదేవీలకు వినియోగించుకోవచ్చు.

కార్డ్ మెంబర్ షిప్ వివరాలు..
ఈ కార్డ్ కోసం ఏడాదికి ఫీజు రూపంలో రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సర కాలంలో రూ. 2 లక్షల కంటే ఎక్కువగా ఈ కార్డ్ ద్వారా లావాదేవీలు జరిపితే ఈ వార్షిక ఫీజు చెల్లించనవసరం లేదు. రెంట్ పేమెంట్స్, వాటర్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, పవర్ బిల్స్, ఫ్యూయల్, ఇన్సూరెన్స్, ఈఎంఐ, నగల కొనుగోళ్లు వంటి వాటికి క్యాష్ బ్యాక్ వర్తించదు. అన్నింటికీ కలిపి ఒక నెలలో 10 శాతం క్యాష్ బ్యాక్ కింద రూ.1500 లభిస్తుంది. ఇదే లిమిటేషన్స్ 5 శాతం క్యాష్ బ్యాక్ కి కూడా అమలు అవుతుంది. 1 శాతం క్యాష్ బ్యాక్ లో భాగంగా నెలకు గరిష్టంగా రూ. 500 అందిస్తారు.

అప్లే చేసుకోండి ఇలా..
ఈ కార్డ్ ను తీసుకున్న వెంటనే బెనిఫిట్ కింద మూడు నెలల పాటూ స్విగ్గీలో వన్ మెంబర్ షిప్ లభిస్తుంది. దీనిని స్విగ్గీ అందించే ప్రైమ్ మెంబర్ షిప్ అంటారు. ఈ మెంబర్ షిప్ కింద ఫుడ్ ఆర్డర్ చేసినా, ఇంటి వస్తువులు కొనుగోలు చేసినా, ఏదైనా రెస్టారెంట్స్ లో వెళ్లి భోజనం చేసినా, ఓలా, ఉబర్ వంటి వాటిలో ట్రావెల్ చేసినా మంచి డిస్కౌంట్స్ అందిస్తారు. ఈ స్విగ్గీ యాప్ మరో వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. గతంలోని స్విగ్గీ యాప్ పూర్తిగా తన రూపాంతరాన్ని మార్చుకోబోతుంది. హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తికలిగిన వారు అందజేసిన వివరాల ఆధారంగా అర్హత కలిగిన వాళ్ళకి ఈ కార్డ్ మంజూరు చేస్తుంది బ్యాంకు.

T.V.SRIKAR