Kerala BJP Leader Murdered : 15 మందికి మరణ శిక్ష.. కేరళలో బీజేపీ నేత హత్య కేసు..

15 మందికి మరణ శిక్ష.. కేరళలో బీజేపీ నేత హత్య కేసు కేరళలో రెండేళ్ళ క్రితం జరిగిన బీజేపీ నేత (BJP leader) రంజిత్ శ్రీనివాసన్ (Ranjith Srinivasan) హత్య కేసులో మవినిక్కర అడిషినల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 15 మందికి మరణ శిక్ష (Death sentence) విధించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 30, 2024 | 02:03 PMLast Updated on: Jan 30, 2024 | 2:50 PM

For The First Time In The Countrys History 15 Were Sentenced To Death

Kerala Death Sentence :
కేరళలో రెండేళ్ళ క్రితం జరిగిన బీజేపీ నేత (BJP leader) రంజిత్ శ్రీనివాసన్ (Ranjith Srinivasan) హత్య కేసులో మవినిక్కర అడిషినల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 15 మందికి మరణ శిక్ష (Death sentence) విధించింది. వీళ్ళంతా నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందినవారే. (Popular Front of India) ఒక కేసులో ఇంత మందికి మరణశిక్ష విధించడం కేరళ చరిత్రలోనే ఇదే మొదటిసారి.

బీజేపీ ఓబీసీ మోర్చా (BJP OBC Morcha Secretary of State) రాష్ట్ర కార్యదర్శి అయిన రంజిత్ శ్రీనివాసన్ ను ప్రాసిక్యూషన్ ప్రకారం.. 2021 డిసెంబర్ 19 నాడు అతని ఇంట్లో అత్యంత క్రూరంగా నరికి చంపారు. శ్రీనివాసన్ తన భార్య, తల్లి, బిడ్డ ఎదుట.. కుటుంబ సభ్యుల కళ్ళ ముందే అతి దారుణంగా ఈ హత్య జరిగింది. నిందితుల్లో 8 మందిపై హత్య అభియోగాలు, మిగతా వారిపై కుట్ర ఆరోపణలు రుజువైనట్లు కోర్టు తెలిపింది. వీళ్ళంతా కూడా నిషేదిత పీఎఫ్ఐ, ఎస్డీఐపీ.. శిక్షణ పొందిన కిల్లర్‌ స్క్వాడ్ అని ప్రాసిక్యూషన్‌ వాదించింది. దీన్ని అత్యంత క్రూరమైన నేరంగా పరిగణించి దోషులకు గరిష్ఠ శిక్ష వేయాలని కోర్టును కోరింది. వాదనలు విన్న ధర్మాసనం.. 15మంది దోషులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. వీళ్ళల్లో మొత్తం 8 మంది హత్యలో పాల్గొనగా, మరో నలుగురు పదునైన ఆయుధాలను పట్టుకొని వచ్చినట్టు కోర్టు తెలిపింది. మరో ముగ్గురు శ్రీనివాసన్ హత్యకు కుట్ర పన్నారు.

2021 డిసెంబరు 18 ..
రంజిత్ శ్రీనివాసన్ హత్యకు ముందురోజు.. డిసెంబరు 18న ఎస్డీపీఐ నేత కేఎస్‌ షాన్‌ను ఒక ముఠా హత్యచేసింది. బయటకు వెళ్లిన అతడు.. ఇంటికి తిరిగొస్తుండగా మార్గమధ్యలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే రంజిత్‌‌ను అత్యంత పాశవికంగా హత్య చేయడం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసును దర్యాప్తు చేసిన కేరళ పోలీసులు.. పక్కా అధారాలను సేకరించారు. వీటి ఆధారంగా నిందితులను దోషులుగా నిర్దారించిన మావెలిక్కర అదనపు జిల్లా జడ్జి వీజీ శ్రీదేవి.. వారికి ఉరిశిక్షను ఖరారు చేశారు.