Lok Sabha Speaker Election : లోక్‌సభ చరిత్రలో తొలిసారి స్పీకర్ ఎన్నిక..
భారత లోక్‌సభ చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. లోక్‌సభ స్పీకర్ పదవికి ఇండియా కూటమి అభ్యర్థిని నిలిపింది.
భారత లోక్‌సభ చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. లోక్‌సభ స్పీకర్ పదవికి ఇండియా కూటమి అభ్యర్థిని నిలిపింది. ఎన్నిక విషయంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేరళలోని కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ ఇండియా కూటమి తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీయే నుంచి ఓం బిర్లా నామినేషన్ వేశారు. కాగా మొత్తం 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ఎన్డీఏకు 293, ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 మంది ఎంపీలు ఉన్నారు. కొంతమంది స్వతంత్ర ఎంపీలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. మాజీ స్పీకర్ ఓం బిర్లానే NDA కూటమి మరోసారి బరిలో నిలిపింది. కాగా కాంగ్రెస్ నామినేషన్లపై రాజీ కుదిర్చేందుకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్షాలను సంప్రదిస్తున్నారు.
గతంలో ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం ఆనవాయితీగా వస్తోంది. యూపీఏ1, యూపీఏ2, ఇదే విధానాన్ని అనుసరిస్తు వస్తుంది. యూపీఏ 1 హయాంలో బీజేపీ ఎంపీ చరణ్ జీత్ సింగ్ యూపీఏ 2, లో బీజేపీ ఎంపీ కరియా ముండా డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. అంటే గత పదేళ్ల ఎన్డీఏ పాలనలో తమ తొలి టర్మ్ లోనే డీప్యూటీ స్పీకర్ గా మిత్ర ప్రతిపక్షానికి కాషాయ పార్టీ అవకాశం ఇస్తు వస్తుంది. మరో సారి ఏర్పడిని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఆ డీప్యూటీ స్పీకర్ పోస్ట్ ను ఖాళీగా ఉంచింది. దీంతో రాహుల్ గాంధీ డిప్యూటీ స్పీకర్ పదవిని కాంగ్రెస్ కు ఇవ్వండి.. లోక్ సభ స్పీకర్ ను ఏకగ్రీవకంగా ఎన్నుకుందాం అని.. కాంగ్రెస్ ఎంపీ సురేష్ ఎన్నికల భారీలోనుంచి తప్పుకుంటారాని.. వెల్లడించారు. ఈ డిమాండ్ కు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. లోక్ సభ స్పీకర్ పదవికి కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ధాఖలు చేసింది.