Lalu Prasad Yadav : తీవ్ర అస్వస్థతకు గురైన బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ …
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం.

Former Bihar CM Lalu Prasad Yadav who is seriously ill...
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రిలో ఉన్నారు. కాగా గతంలో కూడా ఆయన గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే..