BRS MLA Shakeel : మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్.. జైలుకు తరలింపు..

బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన బోధన్ (Bhodan) మాజీ ఎమ్మెల్యే (MLA) షకీల్ అహ్మద్ (Shakeel Ahmed) కుమారుడు రహేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాభవన్ (Prajabhavan) దగ్గర బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2024 | 09:16 AMLast Updated on: Apr 08, 2024 | 10:35 AM

Former Brs Mla Shakeels Son Arrested Moved To Nampally Jail

బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన బోధన్ (Bhodan) మాజీ ఎమ్మెల్యే (MLA) షకీల్ అహ్మద్ (Shakeel Ahmed) కుమారుడు రహేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాభవన్ (Prajabhavan) దగ్గర బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత అతను విదేశాలకు పారిపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ అయిన.. నేప‌థ్యంలోనే అత‌ని కోసం గ‌త కొంత‌కాలంగా గాలిస్తున్నారు. హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ర‌హేల్‌ను సోమ‌వారం విమానాశ్ర‌యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే ప్రగతి భవన్ వద్ద జరిగిన ప్రమాదం తర్వాత ర‌హేల్ దుబాయ్‌కు పారిపోయాడు. ఈ ప్ర‌మాదం త‌ర్వాత ర‌హేల్‌కు బ‌దులుగా మరొక‌రిని డ్రైవ‌ర్‌గా చేర్చి.. ర‌హేల్ దుబాయ్ పారిపోవ‌డం జ‌రిగింది. దాంతో పోలీసులు ర‌హేల్‌పై వివిధ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసి, అత‌ని కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్ర‌మంలో ఇవాళ‌ ర‌హేల్ దుబాయ్ నుంచి హైద‌రాబాద్‌కు తిరిగి రాగా, పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ష‌కీల్‌ను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చ‌డం జ‌రిగింది. సాక్ష్యాల‌ను తారుమారు చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న‌పై పోలీసులు అభియోగాలు మోపారు.

డిసెంబర్ 23న (Prajabhavan) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో పంజాగుట్ట పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బోధన్ సిఐతో పాటు, పంజాగుట్ట మాజీ సిఐ దుర్గారావులు నిందితుడిని తప్పించడానికి సహకరించినట్టు దర్యాప్తులో వెల్లడి కావడంతో వారిని సస్పెండ్‌ చేశారు. బోధన్ సిఐ ప్రేమ్‌ కుమార్‌ ద్వారా పంజాగుట్ట సిఐ దుర్గారావును ప్రలోభ పెట్టి కేసును తారుమారు చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే నిందితుల్ని పంజాగుట్ట పిఎస్‌కు తరలించారు. ఆ వెంటనే మాజీ ఎమ్మెల్యే అనుచరులతో పాటు బోధన్ సిఐ ప్రేమ్ కుమార్‌ పంజాగుట్ట పోలీసుల్ని ప్రభావితం చేశారు.