Ponnala Lakshmaiah : ఎమ్మెల్యేనా..? ఎమ్మెల్సీ పదవా..? బీఆర్ఎస్‌లో పొన్నాల స్థానం ఏంటి..?
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయ్. నభూతో అన్న రేంజ్‌లో పొలిటికల్ ట్విస్టులు కనిపిస్తున్నాయ్. పార్టీని నమ్ముకున్న వాళ్లు.. పార్టీకి నమ్మకమైన వాళ్ళు అనుకున్న నాయకులు కూడా ఎన్నికల వేల ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఎన్నికల మాయ ఇదంతా అని జనాలు అడ్జస్ట్ అయిపోతున్నారు.టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విషయంలోనూ ఇలాంటి చర్చ జరుగుతోంది.

Former chief of Telangana Congress. Ponnala Lakshmaiah has resigned from the party Ponnala MLA in Karu Party BRS MLC position
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయ్. నభూతో అన్న రేంజ్‌లో పొలిటికల్ ట్విస్టులు కనిపిస్తున్నాయ్. పార్టీని నమ్ముకున్న వాళ్లు.. పార్టీకి నమ్మకమైన వాళ్ళు అనుకున్న నాయకులు కూడా ఎన్నికల వేల ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఎన్నికల మాయ ఇదంతా అని జనాలు అడ్జస్ట్ అయిపోతున్నారు.టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విషయంలోనూ ఇలాంటి చర్చ జరుగుతోంది. జనగామ నుంచి పొన్నాల అసెంబ్లీ టికెట్ ఆశించారు. ఐతే ఈసారి కష్టమే అని సంకేతాలు అందడంతో.. తీవ్రంగా మనస్తాపానికి లోనయ్యారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. వెళ్తూ వెళ్తూ రేవంత్ మీద, తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాల మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ ఘాటు లేఖ ఒకటి రాసి.. కాంగ్రెస్ అధిష్టానానికి పంపించారు. ఐతే పొన్నాల ఇంటికి వెళ్లి మరీ కేటీఆర్.. బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ఇక్కడే కొత్త చర్చ జరుగుతోంది.
కారు పార్టీలో పొన్నాలకు ఎలాంటి స్థానం కల్పిస్తారనే ఆసక్తి రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. జనగామ అభ్యర్థిపై బీఆర్ఎస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో పొన్నాలకు జనగామ టికెట్ ఇస్తారా.. లేదంటే తర్వాత ఎమ్మెల్సీ హామీతో సరిపెడతారా అనే చర్చ జరుగుతోంది. దాదాపు 30 ఏళ్లుగా పొన్నాల కాంగ్రెస్‌లో ఉన్నారు. అలాంటి నాయకుడు.. హస్తానికి దూరం కావడం, పైగా బీసీ నేత కావడం.. ప్రత్యర్థి పార్టీకి కచ్చితంగా లాభించే అంశం. దీంతో పొన్నాలకు బీఆర్ఎస్ మంచి ప్రాధాన్యత కల్పిస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు అనే చర్చ జరుగుతోంది.
కేటీఆర్ స్వయంగా ఇంటికి వెళ్లి పొన్నాలను కలవడం.. అంతకుముందు బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు సమాలోచనలు చేయడం.. దాసోజు శ్రవణ్ పొన్నాలతో ప్రత్యేకంగా భేటీ కావడం.. ఈ పరిణామాలన్నింటిని చూస్తే.. ఏదో పెద్ద స్కెచ్చే సిద్ధం అవుతోందనే చర్చ జరుగుతోంది. జనగామ అభ్యర్థిని బీఆర్ఎస్ హోల్డ్‌లో పెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించింది. ముత్తిరెడ్డి, పల్లా మధ్య హరీష్ రావు సయోధ్య కుదిర్చారు. ఇలాంటి సమయంలో పొన్నాలకు జనగామ టికెట్ ఇస్తారా అంటే.. ఏదైనా జరగొచ్చు రాజకీయంలో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.