Chandrababu Naidu : యశోధ ఆసుపత్రికి చంద్రబాబు.. కేసీఆర్ ను పరామర్శించనున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరమర్శించనున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

Former CM Chandrababu Naidu will visit Yashoda Hospital.. KCR
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరమర్శించనున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చంద్రబాబు పరామర్శించనున్నారు. కేసీఆర్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. తన ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో కాలుజారి పడిన ఘటనలో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ తుంటి ఎముకకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి, స్టీల్ ప్లేట్లను అమర్చారు. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని డాక్టర్స్ వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. డాక్టర్స్ ఆయన్ను వాకర్ సాయంతో నడిపిస్తున్నారు. ఇప్పటికే.. ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు కూడా పరామర్శించిన సంగతి తెలిసిందే.