Vinukonda YS Jagan : వినుకొండకు బయలుదేరి మాజీ సీఎం జగన్.. జగన్ కాన్వాయ్ అడ్డగించిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత.. బుధవారం రాత్రి హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత.. బుధవారం రాత్రి హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా వినుకొండకు బయలుదేరి వెళ్లారు. వైఎస్ జగన్ తో పాటు మాజీ మంత్రులు, ఎంపీలు,.ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు వినుకొండ బయలుదేరి వెళ్లారు.
వినుకొండకు మార్గ మధ్యంలో.. వైసీపీ అధినేత జగన్ కాన్వాయ్‌ను పోలీసులు మార్గంమధ్యలో అడ్డుకున్నారు. జగన్ కాన్వాయ్ అడ్డగింతకు ముందు.. రోడ్డు మార్గం ద్వారా వినుకొండకు వేళ్లే మార్గంలో ఎక్కడికక్కడ వైసీపీ నేతల కార్లు వైఎస్ జగన్ వెంట వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. 144వ సెక్షన్… తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు లో పార్టీ నేతల వాహనాలు పోలీసులు ఆపేశారు. వినుకొండకు బయల్దేరిన కాన్వాయ్‌లోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల వాహనాలను తాడేపల్లి, గుంటూరు, మంగళగిరి వద్ద నిలిపివేశారు. కేవలం జగన్‌ను మాత్రమే ప్రత్యేక వాహనంలో ముందుకు వెళ్లనిచ్చారు. వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉందని, అదేవిధంగా బాధితుడి ఇంటివైపు రోడ్డు ఇరుకుగా ఉంటుందని అందుకే కొందరిని అడ్డుకున్నట్లు పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. కాగా ఇప్పటికే వినుకొండలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎక్కువ మంది గుమి కూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.