Congress Kadiam Srihari : కాంగ్రెస్లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.. కడియం కావ్య .. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య…?
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఉమ ముఖ్య మంత్రి.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేర కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కుమార్తె కావ్య కూడా పార్టీ లో చేరారు.

Former Deputy CM Kadiam Srihari joined the Congress party. Kadiam Kavya. Kadiam Kavya as Warangal MP candidate.
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఉమ ముఖ్య మంత్రి.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేర కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కుమార్తె కావ్య కూడా పార్టీ లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో వారిద్దరూ కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. వారిని పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నేతలు సాదరంగా ఆహ్వానించారు. నిన్న తన అనుచరులతో సమావేశమైన కడియం శ్రీహరి తన బిడ్డను ఆశీర్వదించాలని కోరారు.
ఈరోజు ఢిల్లీలో సీఈసీ సమావేశం ఉండటంతో వరంగల్ టిక్కెట్ ను కడియం కావ్యకు ఇచ్చేందుకు రెడీ అవడంతో వాళ్లు ఇప్పుడే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ వరంగల్ టిక్కెట్ ఇచ్చినా కడియం కావ్య దానిని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా… కడియం కావ్యకు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం సీటు కాంగ్రెస్ కు ఇచ్చే అవకాశాలున్నాయి.
నిన్న హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ చేరిన సంగతి తెలిసిందే. ఇక బీఆర్ఎస్ మరో ముఖ్య నేత కే.కేశవరావు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.