Kuldeep Yadav: స్టార్ స్పిన్నర్ కు స్టార్ సరిగా లేదా?
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేరికతో కుల్దీప్ యాదవ్‌కు అవకాశాలు మూసుకుపోయే ప్రమాదం ఉందన్నాడు. భారత్‌తో పాటు ఇతర జట్లకు మెగా టోర్నీలో ఫైనల్ ఎలెవన్‌ను ఎంపిక చేయడం పెద్ద సవాల్ అని చెప్పాడు. కుల్దీప్ యాదవ్, ఇటీవల జరిగిన అన్నీ సిరీస్‌ల్లోనూ నిలకడైన ప్రదర్శన చేశాడు. పిచ్ పొడిగా ఉంటే మాత్రం కేవలం ఇద్దరు ప్రధాన పేసర్లతోనే ఆడాలి.
అప్పుడు ముగ్గురు స్పిన్నర్లను ఆడించే అవకాశం లభిస్తోంది. ఆసియా కప్‌లో గాయపడిన అక్షర్ పటేల్ పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు.ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్ కంటే అశ్విన్‌కే ప్రథమ ప్రాధాన్యత లభిస్తోందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అయితే ఈ వ్యాఖ్యలకు భిన్నంగా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. భారత్ తరఫున కుల్దీప్ యాదవే అత్యధిక వికెట్లు తీస్తాడని జోస్యం చెప్పాడు.