cheating case, cricketer S Sreesanth : మరో వివాదంలో చిక్కుకున్న భారత మాజీ క్రికెటర్ ఎస్ శ్రీశాంత్..
టీమిండియా మాజీ క్రికెటర్ ఎస్ శ్రీకాంత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. 2019 ఏప్రిల్ 25 నుంచి కర్ణాటకలోని కొల్లూరులో శ్రీకాంత్ కు చెందిన ఓ స్పోర్ట్స్ అకాడమీని విర్మిస్తామని చెప్పి వివిధ తేదీల్లో ఇద్దరు నిందితులు రాజీవ్ కుమార్, వెంకటేష్ వారి నుంచి రూ. 18.70 లక్షలు తీసుకున్నట్లు బాలగోపాల్ వెల్లడించారు.

Former Indian cricketer S Sreesanth who is involved in another controversy.
టీమిండియా మాజీ క్రికెటర్ ఎస్ శ్రీశాంత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. 2019 ఏప్రిల్ 25 నుంచి కర్ణాటకలోని కొల్లూరులో శ్రీశాంత్ కు చెందిన ఓ స్పోర్ట్స్ అకాడమీని విర్మిస్తామని చెప్పి వివిధ తేదీల్లో ఇద్దరు నిందితులు రాజీవ్ కుమార్, వెంకటేష్ వారి నుంచి రూ. 18.70 లక్షలు తీసుకున్నట్లు బాలగోపాల్ వెల్లడించారు. ఈ వివరాలను బాలగోపాల్ స్వయంగా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అకాడమీలో పాట్నర్షిప్ అయ్యే అవకాశం రావడంతో ఆ డబ్బును పెట్టుబడి కింద పెట్టినట్లు బాలగోపాల్ పిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం అడిగితే మాట దాటేయడంతో .. ఏం చేయలేక పోలీసులను ఆశ్రయించిన.. ఏలాంటి స్పందన లేకపోవడంతో కన్నూర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు క్రికెటర్ శ్రీశాంత్ తో పాటు మరో ఇద్దరి పై కన్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఈ ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం.. ఈ కేసులో శ్రీశాంత్ ను మూడో నిందితుడిగా మాజీ క్రికెటర్ ఎస్ శ్రీశాంత్ ను పోలీసులు చేర్చారు. ఐపీసీ సెక్షన్ 420 (మోసం చేయడం, నిజాయితీగా ఆస్తుల పంపిణీని ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేశారు.
BJP DECIDES: తెలంగాణలో గెలుపోటముల్ని నిర్ణయించేది బీజేపీనే..? ఏ పార్టీపై ప్రభావం ఎంత..?
కాగా.. ఎస్ శ్రీశాంత్ చివరిసారిగా 2013లో ఇరానీ కప్ టోర్నమెంట్ కు ఆడాడు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఏడేళ్ల నిషేదాన్ని అనుభవించాడు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత రంజీ ట్రోపీ లో ఆడాడు ఎస్ శ్రీశాంత్. శ్రీశాంత్ భారత్‌కు 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టులో సభ్యుడుగా ఉన్నాడు.