CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. రిక్వెస్ట్ ఏంటో తెలుసా..?
హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను సోమవారం మాజీ మంత్రి మల్లారెడ్డి పారమర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఇక కుటుంబ సంభ్యలుతో కాసేపు ముచ్చటించారు. మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసి కేసీఆర్ ఆరోగ్యం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.

Former minister Mallar Reddy requested by CM Revanth Reddy..
హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను సోమవారం మాజీ మంత్రి మల్లారెడ్డి పారమర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఇక కుటుంబ సంభ్యలుతో కాసేపు ముచ్చటించారు. మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసి కేసీఆర్ ఆరోగ్యం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.
“ఇంకా రెండు మూడు రోజుల్లో కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. మాజీ సీఎం కేసీఆర్ కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ తెలంగాణను దేశం లోనే ఒక మోడల్ గా తయారు చేశారు. కేటీఆర్ లేని హైదరాబాద్ ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నాను. అని మీడియాతో చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి ఓ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో చాలా అభివృద్ది చెందింది. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ సీఎంగా లేనందుకు చాలా బాధపడుతున్నారు. రాష్ట్రంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డికి కోరారు.. మాజీ మంత్ర మల్లరెడ్డి. ”
గతంలో మల్లారెడ్డి ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఉన్న సమయంలో.. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మంటుంది. ఒకరిపై ఒకరు సవాల్ లకు ప్రతి సవాల్ చేసుకున్న సందర్భాలు ఎన్నో.. ఒకానొక సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక వచనంతో బూతులు తిడుతున్న సందర్భాలు కూడా మనం చూశాం.. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం.. మల్లారెడ్డి సీఎంకు విజ్ఞప్తి చేయడం కాస్తా కొత్త ఉంది.