PV Narasimha Rao: మన పీవీ.. భారతరత్నం.. చరణ్ సింగ్, స్వామినాథన్‌లకు కూడా..

పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌కు కూడా భారత రత్న ఇవ్వబోతోంది. ఈ ఏడాదిలో మొత్తం ఐదుగురికి భారతరత్న ఇవ్వబోతున్నారు. పీవీ నర్సంహారావుకు భారతరత్న ప్రకటించడంపై తెలుగు ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 9, 2024 | 02:46 PMLast Updated on: Feb 09, 2024 | 7:41 PM

Former Pm Pv Narasimha Rao And Two Others To Be Conferred With Bharat Ratna

PV Narasimha Rao: మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు దేశంలోనే అత్యున్న పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌కు కూడా భారత రత్న ఇవ్వబోతోంది. ఈ ఏడాదిలో మొత్తం ఐదుగురికి భారతరత్న ఇవ్వబోతున్నారు. గతంలో బిహార్ జననేత కర్పూరి ఠాకూర్‌తో పాటు.. మాజీ ఉపప్రధాని ఎల్‌కె అద్వానీకి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒకే ఏడాదిలో ఐదుగురికి భారతరత్న ఇవ్వడం ఇదే మొదటిసారి.

PM MODI-YS JAGAN: చంద్రబాబు, మోదీతో జగన్ మీటింగ్‌.. భేటీలో ఏం జరిగింది.. రాజకీయ సంచలనాలు ఖాయమా..?

పీవీ నర్సంహారావుకు భారతరత్న ప్రకటించడంపై తెలుగు ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. 1991 నుంచి 1996 వరకూ భారత ప్రధానిగా పీవీ దేశానికి సేవలు అందించారు. మే 1991లో రాజీవ్ హత్య తర్వాత ప్రధానిగా పీవీ బాధ్యతలు నిర్వహించారు. 90ల్లో ఆర్థిక సంస్కరణల సృష్టికర్త కూడా ఆయనే. అప్పట్లో దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయి.. విదేశాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అమలువుతున్న ఆర్థిక సంస్కరణలను భారత్‌లో కూడా ప్రవేశపెట్టారు పీవీ. అప్పుడు గండం నుంచి గట్టెక్కించడంతో పాటు.. విదేశీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్కరణలు ఉపయోగపడ్డాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించారు. దీంతో దేశం గాడిలో పడింది.
దేశ చరిత్రలో ఓ తెలుగు వ్యక్తికి భారతరత్న రావడం అనేది ఇదే మొదటిసారి. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం 53 మందికి భారతరత్న అవార్డులను ఇచ్చింది. ‘రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావు ఈ దేశానికి చేసిన సేవలు అపారం. ఏపీ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమ’ని ప్రధాని మోడీ X లో ట్వీట్ చేశారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో పీవీ నాయకత్వం బలమైన పునాదులు వేసిందనీ.. పీవీ హయాంలోనే ప్రపంచ మార్కెట్‌ను భారత్‌ ఆకర్షించిందని తెలిపారు. పీవీ పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైంది. విదేశాంగ విధానం, విద్యా రంగంలో ఆయన అందించిన సహకారం.. దేశాన్ని సాంస్కృతికంగా, మేధోపరంగా సుసంపన్నం చేసింది’’ అని ప్రధాని మోడీ X లో ట్వీట్ చేశారు. పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్‌ 28న వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ, బాంబే, నాగ్‌పుర్‌ యూనివర్సిటీల్లో చదివారు.

Nagababu Anakapally MP :నాగబాబు ఆ స్థానం నుంచే పోటీ ! గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న జనసేన

స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పీవీ.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 1957-77 లో ఉమ్మడి ఏపీలో అనేక మంత్రి పదవుల్లో కొనసాగారు. 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో హోంశాఖ, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 1991లో పాలిటిక్స్ గుడ్ బై చెబుదామని అనుకున్నారు. కానీ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య జరడంతో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. 1991 నుంచి 1996 వరకు భారత ప్రధానిగా పీవీ పనిచేశారు. ఈ పదవి చేపట్టిన మొదటి దక్షిణ భారత, ఏకైక తెలుగువ్యక్తి పీవీయే. నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి కాకుండా కాంగ్రెస్‌ నుంచి ప్రధానిగా ఎన్నికైన మొదటి వ్యక్తి కూడా. 1991లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి 5లక్షల మెజార్టీతో గెలిచి సాధించి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. భార‌తీయ ఫిలాస‌ఫీ, సంస్కృతి గురించి అవగాహన ఉన్న పీవీ.. తెలుగులో సుప్రసిద్ధ నవల ‘వేయిపడగల’ను ‘సహస్రఫణ్‌’ పేరుతో హిందీలోకి అనువదించారు. పీవీ 14 భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.

https://youtu.be/MMZMIwGxTCI