తెలుగు క్రికెటర్లపై ఫ్రాంచైజీల ఆసక్తి, వేలంలో అమ్ముడైంది వీరే
ఐపీఎల్ మెగావేలంలో పలువురు తెలుగు క్రికెటర్లు ఫ్రాంచైజీలను ఆకట్టుకున్నారు. ఇప్పటికే తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ లో సత్తా చాటుతున్నారు.
ఐపీఎల్ మెగావేలంలో పలువురు తెలుగు క్రికెటర్లు ఫ్రాంచైజీలను ఆకట్టుకున్నారు. ఇప్పటికే తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ లో సత్తా చాటుతున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే మరికొందరు ఆటగాళ్ళు ఈ సారి వేలంలో అమ్ముడయ్యారు. ఏపీకి చెందిన ముగ్గురు ఆటగాళ్ళు ఐపీఎల్ లోకి అడుగుపెట్టారు. గుంటూరుకు చెందిన షేక్ రషీద్ ను మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది.గత రెండు సీజన్లలోనూ షేక్ రషీద్ చెన్నై జట్టుకే ఉన్నాడు. అలాగే తొలిసారి కాకినాడకు చెందిన సత్యనారాయణ రాజు ఐపీఎల్ లోకి ఎంపికయ్యాడు. 30 లక్షల బేస్ ప్రైస్ తో అతన్ని ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఇక వైజాగ్ కు చెందిన పైల అవినాశ్ కూడా ఐపీఎల్ కు సెలక్ట్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్ 30 లక్షలకు అవినాశ్ ను సొంతం చేసుకుంది.