Froud Chat GPT: వణుకు పుట్టినస్తున్న ఫ్రాడ్‌ జీపీటీ.. చాట్‌ జీపీటీని మించిన సైబర్‌ నేరగాళ్ల అస్త్రం..

టెక్నాలజీ అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో.. నేరాలు చేసేందుకు సైబర్‌ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో వాడుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 20, 2023 | 02:24 PMLast Updated on: Aug 20, 2023 | 2:24 PM

Fraud Chat Gpt Has Become A Weapon Of Cyber Crime With Technology Beyond Chat Gpt

టెక్నాలజీ అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో.. నేరాలు చేసేందుకు సైబర్‌ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో వాడుకుంటున్నారు. నిజం చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో సైబర్‌ నేరగాళ్లు వాడుతున్న టెక్నాలజీ చూసి పోలీసులే షాకవుతున్నారు. టెక్నాలజీని ఇలా కూడా వాడుకోవచ్చా అని షాకవుతున్నారు. ఈ కోవకు చెందిందే ఫ్రాడ్‌ జీపీటీ. ఇది అచ్చూ చాట్‌ జీపీటీలా పని చేస్తుంది. కథలు కవితలతో పాటు కంప్యూటర్‌ ప్రోగ్రాంలు కూడా అందిస్తూ చాట్‌ జీపీటీ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. అచ్చూ అలాగే పని చేసే ఫ్రాడ్‌ జీపీటీ ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లకు మంచి వెపన్‌లా మారింది.

రీసెంట్‌గా ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మరో కంపెనీ నుంచి సర్వీస్‌ తీసుకుంది. వాళ్ల మధ్య లావాదేవీలను గమనించిన సైబర్‌ నేరగాళ్లు మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటూ ఆ కంపెనీకి సర్వీస్‌ ఇచ్చిన కంపెనీ ఐడీతో మెయిల్‌ చేశారు. కంపెనీ మెయిల్‌ నుంచి అకౌంట్‌ డిటెయిల్స్‌ రావడంతో మనీ ట్రాన్స్‌ఫర్‌ చేశారు సర్వీస్‌ తీసుకున్న కంపెనీ వాళ్లు. ఈ ట్రాన్జాక్షన్‌ జరిగిన కొన్ని రోజులకే సర్వీస్‌ ఇచ్చిన కంపెనీ నుంచి మళ్లీ మెయిల్‌ వచ్చింది. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ ఫ్రాడ్‌ చేసేందుకు నేరగాళ్లు వాడుకున్న టూల్‌ ఫ్రాడ్‌ జీపీటీ. ఏదైనా కంప్యూటర్‌ను హ్యాక్‌ చేయాలి అనుకుంటే దానికి కావాల్సిన ప్రోగ్రాంను ఫ్రాడ్‌ జీపీటీ సిద్ధం చేస్తుంది.

దీంతో కంప్యూటర్‌ను హ్యాక్‌ చేసి సింపుల్‌గా వాళ్ల మెయిల్‌ ఐడీ నుంచి మెయిల్స్‌ పెట్టొచ్చు. ప్రతీ కంపెనీ సెక్యూరిటీ సిస్టం కోసం ఏర్పాటు చేసుకునే ఫైర్‌వాల్స్‌ను ఫ్రాడ్‌ జీపీటీతో సింపుల్‌గా దాటేయొచ్చు. ఎవరూ ఊహించని స్థాయిలో ఆర్థిక నేరాలు ఫ్రాడ్‌ జీపీటీ ద్వారా జరిగే చాన్స్‌ ఉందని టెక్‌ నిపుణులు చెప్తున్నారు. నెల రోజుల నుంచి ఈ ఫ్రాడ్‌ జీపీటీ డార్క్‌ వెబ్‌లో అందుబాటులో ఉంది. ఇప్పటికే 3 వేల మంది ఫ్రాడ్‌జీపీటీని కొనుగోలు చేసినట్టు సమాచారం. వీళ్లంతా నేరాలకు పాల్పడితే జరిగే నష్టం ఊహించడం కూడా కష్టమే.