ఏపీలో మహిళలకు చంద్రబాబు బిగ్ గుడ్ న్యూస్…!

ఏపీ మహిళలకు ఏపీ సిఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్ పథకానికి సర్కార్ శ్రీకారం చుట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. రెండు రోజుల నుంచి హైదరాబాద్ పర్యటనలో ఉన్న చంద్రబాబు… నేడు అమరావతి రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా అమరావతిలోని సచివాలయానికి వెళ్తారు.
ఉదయం 11 గంటలకు ఆర్టీసీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతోపాటు వివిధ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ పథకం అమలుకి సంబంధించి ఇప్పటికే తెలంగాణా, కర్ణాటక ప్రభుత్వాలు అమలు చేస్తున్న పద్దతిని అధికారులు స్టడీ చేసి ఒక నివేదిక సిద్దం చేసారు. వాటిని పరిశీలించి చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది.