ORS DRINKS: ఓఆర్ఎస్‌గా ఫ్రూట్ జ్యూస్‌లు.. ప్రమాదకరం అంటున్న డాక్టర్లు
ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) నిపుణులు, వైద్యులు చెబుతున్న విషయం. ప్రస్తుతం కొన్ని రకాల ఫ్రూట్ జ్యూస్‌లను ఓఆర్ఎస్ డ్రింక్స్‌గా సేల్ చేస్తున్నారు. అంటే.. ఓఆర్ఎస్‌ఎల్, రీబ్యాలెన్జ్‌విట్ ఓఆర్‌ఎస్‌లుగా విక్రయిస్తున్నారు.
ORS DRINKS: ఎండాకాలంలో కాస్త డీహైడ్రేట్ అయినట్లు అనిపించినా.. లేక డయేరియాకు గురైనా.. నీరసంగా ఉన్నా వెంటనే అందరూ చేసే పని ఓఆర్ఎస్ డ్రింక్స్ తాగడం. వీటిని తాగితే ఒంట్లోకి తక్షణ శక్తి వస్తుందనుకుంటారు. కానీ, ఆ అవకాశం లేదంటున్నారు పీడియాట్రిక్స్ ఎక్స్‌పర్ట్స్. కారణం.. మార్కెట్లో ఓఆర్ఎస్‌గా చెలామణి అవుతున్న చాలా డ్రింక్స్ నిజమైన ఓఆర్ఎస్‌లు కావు. అవి ఫ్రూట్ జ్యూస్‌లు. కొన్ని ఫ్రూట్ జ్యూస్‌లపై ఓఆర్ఎస్ అని డ్రింక్స్ లేబుల్ వేసి అమ్ముతున్నారు. ఇది మేం చెబుతోంది కాదు.
PAWAN KALYAN: పదే పదే జ్వరం.. పవన్ ఆరోగ్యానికి ఏమైంది..?
ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) నిపుణులు, వైద్యులు చెబుతున్న విషయం. ప్రస్తుతం కొన్ని రకాల ఫ్రూట్ జ్యూస్‌లను ఓఆర్ఎస్ డ్రింక్స్‌గా సేల్ చేస్తున్నారు. అంటే.. ఓఆర్ఎస్‌ఎల్, రీబ్యాలెన్జ్‌విట్ ఓఆర్‌ఎస్‌లుగా విక్రయిస్తున్నారు. నిజానికి వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ డ్రింక్స్ తీసుకుంటే డయేరియా ఇంకా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు డయేరియా వచ్చినప్పుడు ఇచ్చే ఈ తరహా డ్రింకులు ప్రమాదకరం అంటున్నారు డాక్టర్లు. ఇలా వేరే డ్రింక్స్‌ను ఓఆర్ఎస్‌గా లేబుల్ వేసి అమ్మడం వల్ల ఓఆర్ఎస్‌పై జనాలకు నమ్మకం పోతుందని, అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఎక్స్‌పర్ట్స్. రోగుల భద్రత, వైద్యారోగ్య రంగంపైనే ప్రభావం పడుతుందంటున్నారు. ఈ విషయంలో దేశంలోని ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మోసపూరిత వ్యాపార విధానాలపై ఇండియన్ మెడికల్ అసోసియేన్ (ఐఎంఏ) స్పందించకపోవడం సరికాదని డాక్టర్ల అంటున్నారు. వెంటనే ఐఎంఏ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దేశంలో డయేరియా గరైన చిన్నారులతోపాటు అన్ని వయసుల వారికి ఓఆర్ఎస్‌ను ఐఏపీ రికమెండ్ చేస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ఓఆర్ఎస్‌లో నిర్దేశిత ఫార్ములాను ఫాలో అవ్వాలి. అంటే సోడియం, గ్లూకోజ్, పొటాషియం, సైట్రేట్ వంటివి తగిన మోతాదులో ఉండి తీరాలి. అప్పుడే డయేరియా, డీ హైడ్రేషన్‌ను ఎదుర్కోవచ్చు. మార్కెట్లో ఓఆర్ఎస్‌లుగా చెలామణి అవుతున్న ఫ్రూట్ జ్యూస్‌ల విషయంలో అందరూ అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. నిజమైన ఓఆర్ఎస్‌లు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూడాలని సూచిస్తున్నారు. అప్పుడే రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అలాగే.. వినియోగదారులు కూడా ఓఆర్ఎస్ కొనేముందు వాటిపై లేబుల్స్ చదవాలి. డయేరియాకు వాడొచ్చా.. లేదా అనే సూచన వాటిపై కనిపిస్తుంది. డయేరియాకు వాడొచ్చు అని ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి.