గబ్బా టెస్ట్ డ్రా… మనకు WTC ఫైనల్ ఛాన్స్ ఉందా ?

గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం టీమిండియా 260 పరుగులకు ఆలౌటైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 19, 2024 | 02:15 PMLast Updated on: Dec 19, 2024 | 2:15 PM

Gabba Test Draw Do We Have A Chance Of The Wtc Final

గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం టీమిండియా 260 పరుగులకు ఆలౌటైంది. 185 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 89/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దాంతో భారత్‌ ముందు 275 పరుగుల లక్ష్యం నమోదైంది. ఈ లక్ష్యచేధనకు టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించగా.. వర్షం అంతరాయం కలిగించింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 8/0తో నిలిచింది. వర్షం తీవ్రత పెరగడంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. మూడో టెస్ట్ డ్రాగా ముగిసిన నేపథ్యంలో ఇరు జట్లు సిరీస్ తో 1-1తో సమంగా నిలిచాయి.

ఈ మ్యాచ్ తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఆస్ట్రేలియా జట్టు రెండో స్థానంలోనూ, భారత జట్టు మూడో స్థానంలోనూ కొనసాగుతున్నాయి. దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ టీమ్ ఇండియాకు ఇంకా డబ్ల్యుటిసి ఫైనల్ ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు జట్లకు 4-4 పాయింట్లు వచ్చాయి. డబ్ల్యుటిసి పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా 10 మ్యాచ్‌లలో 6 గెలిచింది. ఆ జట్టు మూడింట్లో ఓడి 1 మ్యాచ్‌ డ్రా చేసుకుంది. ప్రొటీస్ జట్టు 76 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. కంగారూ జట్టు 15 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించింది. 4 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడగా, 2 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు భారత్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో భారత్‌కు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల ఫలితాలు మాత్రమే భారత్-ఆస్ట్రేలియా మధ్య ఏ జట్టు ఫైనల్‌కు చేరుకోవాలో నిర్ణయిస్తాయి. మిగిలిన 2 మ్యాచ్‌లు గెలిస్తే భారత జట్టు 138 పాయింట్లతో పాటు 60.52 శాతంగా ఉంటుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్ రేసుకు దూరమవుతుంది. ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకను 2-0తో ఓడించినట్లయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. భారత్-ఆస్ట్రేలియా సిరీస్ 2-2తో సమమైతే, భారత్ 126 పాయింట్లు, 55.26 పాయింట్ల శాతాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకతో కనీసం ఒక్క విజయంతోనైనా ఆస్ట్రేలియా భారత్‌ను అధిగమిస్తుంది.