Gaddam Prasad Kumar : అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రసాద్ కుమార్. ఈయన స్వగ్రామం తాండూర్ మండలం బెల్కటూర్. గతంలో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పని చేశారు. ప్రసాద్‌ కుమార్‌ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు.. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బి. సంజీవరావుపై గెలిచారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 7, 2023 | 01:00 PMLast Updated on: Dec 07, 2023 | 1:00 PM

Gaddam Prasad Kumar As Speaker Of The Assembly

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రసాద్ కుమార్. ఈయన స్వగ్రామం తాండూర్ మండలం బెల్కటూర్. గతంలో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పని చేశారు. ప్రసాద్‌ కుమార్‌ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు.. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బి. సంజీవరావుపై గెలిచారు. మొదటిసారిగా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికైంది అప్పుడే. ఆ తర్వాత 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌ పై 4 వేల 859 ఓట్ల మెజారిటీతో.. రెండోసారి ఎమ్మెల్యేగా గడ్డం ప్రసాద్ కుమార్ గెలిచారు.

గడ్డం ప్రసాద్‌ కుమార్‌ 2012లో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 & 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యారు. గడ్డం ప్రసాద్‌కుమార్‌ 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. లేటెస్ట్ గా జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సాధించారు. దాంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా ఆయనకు అవకాశం కల్పించింది.