Gaddam Prasad Kumar: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్..!
కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే ఈ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమే. అది కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. గురువారం ప్రొటెం స్పీకర్ నుంచి అధికారిక ప్రకటన ఉంటుంది.

Gaddam Prasad Kumar: తెలంగాణ నూతన అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను గురువారం ప్రొటెం స్పీకర్ అధికారికంగా వెల్లడించనున్నారు. స్పీకర్ ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించారు. ఈ గడువు బుధవారంతో ముగిసింది. కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే ఈ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమే. అది కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.
Parliament attack: పరిచయం లేని నలుగురు.. పక్కా ప్లాన్‌తో దాడి..
గురువారం ప్రొటెం స్పీకర్ నుంచి అధికారిక ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్‌కు స్పీకర్‌గా బాధ్యతలు అప్పగిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు మద్దతు ప్రకటించాయి. గతంలో పాటించిన సంప్రదాయ ప్రకారం స్పీకర్ కోసం పోటీ పెట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం గడ్డం ప్రసాద్ నామినేషన్‌లో పాల్గొనడం విశేషం. నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15న అసెంబ్లీ, మండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
16న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయ ప్రస్థానం 2008లో మొదలయ్యింది. ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, రెండుసార్లు ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో గెలుపొందారు. తెలంగాణ అసెంబ్లీకి 3వ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అంతకుముందు 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేనేత శాఖా మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ వివిధ హోదాల్లో పని చేశారు.