Gaddar: బాల్యం నుంచే చైతన్య స్పూర్తి..
గద్దర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించాడు ఈ యోధుడు. బాల్యం, విద్యాభ్యాసం మొత్తం నిజామాబాద్, మహబూబ్ నగర్ లో పూర్తి చేశారు.
హైదరాబాద్ లో ఇంజనీరింగ్ విద్యలో పట్టా పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. తనదైన గొంతును వినిపిస్తూ పోరాట స్పూర్తిని రగిలించారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.
అంతేకాకుండా కుటుంబ నియంత్రణ, పారిశుద్యం, పరిశుభ్రత వంటి సామాజిక అంశాలను సృషిస్తూ బుర్రకథల ద్వారా ప్రజా చైతన్యానికి శ్రీకారం చుట్టారు. అనేక పాటలు, కవితలు రాసి ప్రజాధారణ పొందారు. 1975లో బ్యాంకు పరీక్షలు కూడా రాశారు. కెనరా బ్యాంకు క్లర్క్ గా పనిచేసి ఆతరువాత విమల అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. గద్దర్ కి ముగ్గురు సంతానం. వీరి పేర్లుకూడా ప్రకృతిని పలకరించేలా సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అని పెట్టుకున్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈయనకు సమాజం పట్ల, ప్రకృతి పట్ల ఎంతటి గౌరవం, ప్రేమ ఉన్నాయో. ఇంతటి మహోదయ కిరణం అస్తమించిందంటే అది యావత్ ప్రపంచానికే తీరని లోటుగా అభివర్ణించవచ్చు. కొన్ని రోజుల తరువాత కాంరంచేడులో దళితులపై జరిగిన ఘటన గద్దర్ ను తీవ్రంగా కలిచివేసింది. అందుకే దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఒడిషా వంటి రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. మన రాష్ట్రం పైనే కాకుండా పొరుగు రాష్ట్రాలపై ఇతనికి ఉన్న మైత్రీ బంధానిని నిదర్శంగా చెప్పవచ్చు.
T.V.SRIKAR