Gaddar Movie Songs:సైన్మా రంగాన సాయుధ పోరాట యోధుని ముద్ర
సినిమా పాటలు అనగానే మంచి సాహిత్యం, విలువలు ఉండవని అంటూ ఉంటారు. వాటికి చరమగీతం పాడుతూ తన విప్లవగీతాన్ని అందించారు.
నేటికీ ఈ పాటలు బహు ప్రాశస్థ్యం పొందుతున్నాయి. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆనాటి నుంచే సినిమాల్లో రచనలు చేసేవారు గద్దర్. అవకాశం, సందర్భం వచ్చినప్పుడల్లా తన విప్లవ భావాన్ని రంగరించి ప్రజలలో పోరాట స్పూర్తికి ఊతం ఇచ్చేవారు. 1971లో తన కలానికి పని పెట్టారు. బి. వి. నరసింగరావు ప్రోత్సాహంతో ఓరేయ్ రిక్షా అనే పాటను రాశారు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోనవసరం లేకుండా పోయింది. ఇతని ప్రతిభకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి.
1995 లో ఓరేయ్ రిక్షా సినిమాలో వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా అనే పాటతో సిస్టర్ సెంటిమెంట్ తో కళ్లు చమ్మగిల్లేలా చేశారు. నేటికీ ఈ పాటను సందర్భానుసారంగా అనేక సినిమాల్లో చూపిస్తూనే ఉంటారు. 2011 లో జై భోలో తెలంగాణ చిత్రంలో గద్దర్ పాడిన పాటకు నంది అవార్డు వరించింది. ఈ సినిమా ద్వారా తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసినట్లయిందనే చెప్పుకోవాలి. ఆపాట మనందరి మదిలో నేటికే కాదు మరో యుగం వరకూ యుగళ గీతంగా మారుమ్రోగుతూనే ఉంటుంది. అదే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా.
T.V.SRIKAR