స్వదేశానికి గంభీర్ పయనం, ప్రాక్టీస్ మ్యాచ్ కు మిస్
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ ఇండియాకు బయలుదేరాడు. అత్యవసరమైన వ్యక్తిగత కారణాలతో గంభీర్.. స్వదేశానికి బయలుదేరినట్లు తెలుస్తోంది.

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ ఇండియాకు బయలుదేరాడు. అత్యవసరమైన వ్యక్తిగత కారణాలతో గంభీర్.. స్వదేశానికి బయలుదేరినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6వ తేదీన అడిలైడ్‌లో జరగనున్న రెండవ టెస్టుకు ముందు.. మళ్లీ గంభీర్ జట్టుతో కలవనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే నవంబర్ 30 నుంచి జరగనున్న వార్మప్ మ్యాచ్‌కు గంభీర్ అందుబాటులో ఉండడు. ఇదిలా ఉంటే రెండవ టెస్టు మ్యాచ్ డే అండ్ నైట్ గేమ్ కావడంతో.. భారత జట్టు ఆ మ్యాచ్ కన్నా ముందే ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడబోతోంది. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో టీమిండియా తలపడుతుంది. కాగా రెండో టెస్టు కోసం పింక్ కలర్ కోకాబురా బంతిని వాడనున్నారు.