హైదరాబాద్ లో అలజడి, కారులో గ్యాంగ్ రేప్
సైదాబాద్ పునరావాస కేంద్రంలో ఉన్న బాలికలపై గ్యాంగ్‌రేప్ ఘటన ఇప్పుడు సంచలనం అయింది. సైదాబాద్ పునరావాస కేంద్రం నుంచి పారిపోయి జనగాం వెళ్లిన ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్ జరిగింది.

సైదాబాద్ పునరావాస కేంద్రంలో ఉన్న బాలికలపై గ్యాంగ్‌రేప్ ఘటన ఇప్పుడు సంచలనం అయింది. సైదాబాద్ పునరావాస కేంద్రం నుంచి పారిపోయి జనగాం వెళ్లిన ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్ జరిగింది. బాలికలను ట్రాప్ చేసి అత్యాచారానికి ఐదుగురు యువకులు ఒడిగట్టారు అని విచారణలో వెల్లడి అయింది. జనగాం నుంచి హైదరాబాద్ తీసుకొస్తూ కారులోనూ లైంగిక దాడి చేయడం సంచలనం అయింది.
అనంతరం బాలికలను పునరావాస కేంద్రం వద్ద యువకులు వదిలి వెళ్ళారు. విషయాన్ని బాలికలు అధికారులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్న సైదాబాద్ పోలీసులు… యువకులపై పోక్సో కేసు నమోదు చేసారు. వారిని రిమాండ్ కు తరలించి విచారిస్తున్నారు.