Top story: గరికపాటి జీవితంలో ట్విస్టులే ట్విస్టులు మొదటి భార్యకు విడాకులు…రెండో భార్యతో లైఫ్ సెటిల్

గరికపాటి నరసింహారావు...సుప్రసిద్ధ అవధాని. తెలుగు రచయిత, మంచి ఉపన్యాసకుడు. తన వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకర్షించడంలో ముందుంటారు. ఎవరేమనుకున్నా...తాను మనసులో ఉన్నది కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 8, 2025 | 04:51 PMLast Updated on: Jan 08, 2025 | 4:51 PM

Garikapatis Life Is Full Of Twists And Turns Including A Divorce From His First Wife 2

గరికపాటి నరసింహారావు…సుప్రసిద్ధ అవధాని. తెలుగు రచయిత, మంచి ఉపన్యాసకుడు. తన వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకర్షించడంలో ముందుంటారు. ఎవరేమనుకున్నా…తాను మనసులో ఉన్నది కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. సరళమైన భాషలో ప్రస్తుత జనరేషన్ కు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పడంతో గరికపాటి ఘనాపాఠి. ఆయన జీవితంలో చీకట్లు ఉన్నాయి…వెలుగులు ఉన్నాయి. పెళ్లిళ్లు…విడాకులు…ఇలా చెప్పుకుంటూ పోతే…అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి.

గరికపాటి నరసింహరావు…చాలా మందికి అవధానిగా మాత్రమే తెలుసు. అంతకంటే ముందు ఆయన ఉపాధ్యాయుడిగా, లెక్చరర్ గా, ప్రిన్సిపల్ గా పని చేశారని తెలుసు ? అని ప్రశ్నిస్తే…90 శాతం మందికి తెలియదు. ఇంత గొప్పగా ప్రజలకు నీతివాక్యాలు వల్లించే గరికపాటి…రెండు పెళ్లిళ్లు చేసుకున్నారంటే ఎవరైనా నమ్ముతారా ? అంటే కష్టమే. కుటుంబాలు, బంధాలు, బంధుత్వాలు, భార్యభర్తల మధ్య అనురాగాల గురించి చెప్పడంలో దిట్ట. ఆయన ప్రసంగాలకు ఎవరైనా మంత్ర ముగ్దులు అవ్వాల్సిందే. ఆయన స్టేజ్ మీద ఉన్నారంటే…జనం కుర్చీల నుంచి కదలరు. అంతలా జనాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆస్తులు సంపాదించుకున్నారు. గరికపాటికి జనంలోనూ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను ఉపయోగించుకొని…కోట్లలో ఆస్తు కూడబెట్టారు.

ఇదంతా నాణెనికి ఒకవైపు మాత్రమే. ఆయన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో 1958, సెప్టెంబర్ 14న జన్మించారు గరికపాటి లక్ష్మనరసింహారావు. వేంకట సూర్యనారాయణ, వేంకట రమణమ్మ తల్లిదండ్రులు. ఎంఎ, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. ఉపాధ్యాయుడిగా, లెక్చరర్ గా 30 ఏళ్లు పని చేశారు. చదుకునే సమయంలో కామేశ్వరి అనే టీచర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. శ్రీశ్రీ, గురజాడ పేర్లు పెట్టుకున్నారు. ఈ పేర్లు పెట్టడానికి కారణం…గరికపాటికి శ్రీశ్రీ, గురజాడ అంటే అమితమైన ప్రేమ. పెళ్లయిన కొత్తలో తెలుగు టీచర్ గా పని చేశారు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ రెసిడెన్సియల్ ను స్థాపించారు. అది అనుకున్నంత సక్సెస్ కాలేదు.

గుంటూరు జిల్లా ఫ్యామిలీని షిఫ్ట్ చేశారు. కొంతకాలం ప్రైవేట్ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు. భార్యకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగడం రావడం…ఆయనకు ఉద్యోగం పోవడంతో విభేదాలు వచ్చాయి. ఎన్ని చోట్ల ఉద్యోగం కోసం ట్రైచేసినా…ఫలితం శూన్యం. విజయవాడ ఆకాశవాణికి సరసవాణి పేరుతో కవితలు పంపినా ఫలిలం లేకుండా పోయింది. ఆ ఫ్రస్టేషన్ మొత్తం భార్య కామేశ్వరి మీద చూపించడంతో…గరికపాటికి విడాకులు ఇచ్చేసి…తన తాను చూసుకుంది. ఇద్దరి పిల్లల బాధ్యతను తండ్రికి ఇచ్చేసింది కామేశ్వరి. కామేశ్వరికి దూరమైన గరికపాటికి…ఆయన తల్లి సంబంధం చూసి…టీచర్ గా పని చేస్తున్న శారదతో వివాహం జరిపించారు. సొంతంగా కాలేజ్, హాస్టల్ మొదలెట్టారు. అది కూడా కలిసి రాలేదు. దీంతో చేసేదేమీ లేక…ఉద్యోగాలు వెతకడం ప్రారంభించారు. కొంతకాలానికే శ్రీచైతన్య కాలేజ్ లో గరికపాటి నరసింహరావు తెలుగు లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. అదే సమయంలో ప్రిన్సిపల్ గా బాధ్యతలు నెరవేర్చారు.

కాలేజీ నుంచి బయటకు వచ్చి…కొన్ని మీడియా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. కాంట్రవర్షీ కామెంట్లు చేసి…వివాదాలు కొనితెచ్చకున్నాడు. మహిళా సంఘాల ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత చేసిన కామెంట్లకు క్షమాపణలు చెప్పాడు. హస్యం పేరుతో మహిళలపై వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. ఓ కార్యక్రమంలో అవధానం చేస్తుండగా…మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు జనం పోటీ పడ్డారు. దీన్ని గరికపాటి నరసింహారావు జీర్ణించుకోలేకపోయారు. ఆగ్రహంతో చిరంజీవి గారు..మీరు కూర్చుంటే…నేను మాట్లాడుతానంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యవహారశైలిపై జనానికి తిక్కరేగింది. గరికపాటిని బూతులతో సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుకున్నారు. ఒకప్పుడు టీచర్ ఉద్యోగం కోసం తిప్పలు పడిన గరికపాటి నరసింహరావు…కోట్ల రూపాయలకు పడగలెత్తారు. ఉపన్యాసాలు, అవధానంతో భారీగా ఆస్తులు సంపాదించారు. ఒక ప్రొగ్రాంకు అవధానం చేయడానికి లక్షల్లో వసూలు చేస్తున్నారు. 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.