geethanjali: నేనున్నా.. గీతాంజలి కూతుర్ని చూసి జగన్ ఎమోషనల్.. ఏం చేశాడంటే
గీతాంజలి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. గీతాంజలి కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పెషల్ సెక్రటరీ హరికృష్ణ ట్విటర్‌లో ప్రకటించారు.
geethanjali; తెనాలి మహిళ గీతాంజలి మరణం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఆమెది ఆత్మహత్యా లేదా ప్రమాదమా అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గీతాంజలి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. గీతాంజలి కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పెషల్ సెక్రటరీ హరికృష్ణ ట్విటర్‌లో ప్రకటించారు.
JANASENA SEATS : చివరకు మిగిలింది 21
తెనాలిలోని ఇస్లాంపేటకు చెందిన గీతాంజలికి రీసెంట్‌గా ఏపీ ప్రభుత్వం ఇంటిస్థలం పట్టా మంజూరు చేసింది. పట్టాను ఎమ్మెల్యే చేతినుంచి అందుకున్న గీతాంజలి తెగ సంబరపడిపోయారు. ఈ సంతోషంలో ఆమె మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలను టీడీపీ, జనసేన ట్రోలింగ్ చేయడం వలన గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. మరోవైపు టీడీపీ, జనసేన వాదన మరోలా ఉంది. గీతాంజలి చావుకు కారణమైనవాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేనని.. ఈ కేసులో లోతైన విచారణ జరపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలు ప్రతీ నెలా గీతాంజలి అకౌంట్‌లో డబ్బులు వేశారని.. చాలా సార్లు ఆమె వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్‌కు వెళ్లిందని కూడా చెప్తున్నారు.
గీతాంజలి కాల్ డేటా బయటికి వస్తే చాలా విషయాలు బయటికి వస్తాయంటూ చెప్తున్నారు. మార్చి 8న గీతాంజలి మాట్లాడిన వీడియో వైరల్ అయ్యిందంటున్న విపక్షాలు.. ప్రమాదం జరిగింది మార్చి ఏడున అని చెప్తున్నాయి. గీతాంజలి మరణం మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అసలేం జరిగిందనే విషయాలను ఆరాతీస్తున్నారు. గీతాంజలిని రైలు ఢీకొట్టిన రోజు ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.