Geetu Royal : బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్న గీతూ రాయల్..
బిగ్ బాస్ (Big Boss) షో తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న వాళ్లలో గీతూ రాయల్ (Geethu Royal) ఒకరు. బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Season 6) లో కంటెస్టెంట్ గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గీతూ తన అట తీరు, మాట తీరుతో కాస్త నెగెటీవిటీ తెచ్చుకుంది.

Geethu Royal suffering from bacterial infection..
బిగ్ బాస్ (Big Boss) షో తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న వాళ్లలో గీతూ రాయల్ (Geethu Royal) ఒకరు. బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Season 6) లో కంటెస్టెంట్ గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గీతూ తన అట తీరు, మాట తీరుతో కాస్త నెగెటీవిటీ తెచ్చుకుంది. కానీ ఈ షో మాత్రం గీతూ రాయల్ ను లైమ్ లోకి తీసుకొచ్చింది. ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చాక యూట్యూబ్ వీడియోలతో పాటు, పలు టీవీ షోలలో పాల్గోంటూ మంచి పాపులారిటీ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా సీజన్ 7కు బిగ్ బాస్ బజ్ అంటూ ఓ ప్రోగ్రాంకు హోస్ట్ గా చేయడం ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ అరుధైన వ్యాధి (Rare Disease)తో బాధ పడుతున్నట్లు వెల్లడించి అందరికీ షాకిచ్చింది. గీతూకి వచ్చిన వ్యాధి ఏంటీ, ప్రస్తుతం అది ఏ స్టేజ్ లో ఉందో పలు విషయాలను ఓ వీడియో ద్వారా పంచుకుంది. గీతూ ఈ ఏడాది మొదటి నెల నుంచే తాను హెల్త్ ప్రాబ్లంతో బాధ పడుతున్నట్లు తెలిపింది. తన హెల్త్ బాగాలనేని టైమ్ లో ఓ దెబ్బ తగలడంతో డాక్టర్ ను సంప్రదించట. ట్రీట్మెంట్ తీసుకున్న కొద్ది రోజలకు ఆ గాయం తగ్గిపోయిందట. అయితే కొంత కాలానికే మళ్లీ నొప్పి రావడంతో పలు హాస్పిటల్స్ కు నాలుగు నెలల పాటు తిరిగిందట. అయితే ఎక్కడికి వెళ్లినా తగ్గకపోయే సరికి కొంచెం డిప్రెషన్ లోకి కూడా వెళ్లిందట.
అదే టైమ్ లో డబ్బులు పోయిన పర్లేదని ఓ పెద్ద హాస్పిటల్ లో అడ్మిట్ అయి అన్ని టెస్ట్‌లు చేయించుకుందట. ఇక టెస్టులలో తనకు మైకో బ్యాక్టీరియల్ (Mycobacterial) నాన్ ట్యూబరికల్ ఇన్ఫెక్షన్ (Non Tubercular Infection) వచ్చిందని డాక్టర్ లు చెప్పారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. TB ఫ్యామిలీకి చెందిన ఈ వ్యాధి చాలా రేర్ గా వస్తుందట. అలా గీతూ రాయల్ అరుదైన వ్యాధి బారిన పడినట్లు తెలిపి అందరికీ షాక్ ఇచ్చింది. దాంతో ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.