KTR : త్వరగా లేవండి నాన్న.. తండ్రిని తల్చుకుని KTR ఎమోషనల్ పోస్ట్..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్‌లో డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. కేసీఆర్‌కు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేసిన డాక్టర్లు 24 గంటలు తిరగకముందే ఆయనతో వాకింగ్ కూడా చేయించారు. మరి కొన్ని వారాల పాటు కేసీఆర్ బెడ్ రెస్ట్ తీసుకోబోతున్నారు. ఎప్పుడూ రాజసం ఉట్టిపడేలా మీటింగ్‌లలో గర్జించే కేసీఆర్‌ను ఈ పరిస్థితిలో చూసి బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు తల్లిడిల్లిపోతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్‌లో డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. కేసీఆర్‌కు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేసిన డాక్టర్లు 24 గంటలు తిరగకముందే ఆయనతో వాకింగ్ కూడా చేయించారు. మరి కొన్ని వారాల పాటు కేసీఆర్ బెడ్ రెస్ట్ తీసుకోబోతున్నారు. ఎప్పుడూ రాజసం ఉట్టిపడేలా మీటింగ్‌లలో గర్జించే కేసీఆర్‌ను ఈ పరిస్థితిలో చూసి బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు తల్లిడిల్లిపోతున్నారు. కేసీఆర్ కొడుకు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా తండ్రి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమెషనల్ పోస్ట్ పెట్టారు. 2009లో ఉద్యమ సమయంలో కేసీఆర్ బెడ్ మీద ఉన్న ఫొటోను.. ఇప్పుడు ఆపరేషన్ తరువాత కేసీఆర్ బెడ్ మీద ఉన్న ఫొటోను జాయింట్ చేసి షేర్ చేశారు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ మీరు మాకోసం నడిచారు. మమ్మల్ని నడిపించారు.
ఇక ముందు కూడా మీ అడుగులు మా భవిష్యత్తు కోసం పడాలి. మీ అడుగుజాడల్లో మేము నడవాలి. మీరు త్వరగా కోలుకోవాలంటూ పోస్ట్ పెట్టారు. కేసీఆర్‌కు ఆపరేషన్ జరిగినప్పటి నుంచీ కేటీఆర్ హాస్పిటల్‌లోనే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడుతూ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి కార్యకర్తలకు, కేసీఆర్ అభిమానులకు అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నారు. కార్యకర్తలతో మాట్లాడుతూ వాళ్లలో ధైర్యం నింపుతున్నారు. కేసీఆర్ ఆపరేషన్ కారణంగా అసెంబ్లీలో కూడా కేటీఆర్ ప్రమాణస్వీకారం చేయలేదు. ఎంతో ధైర్యంగా ఉంటూ.. అందరికీ ధైర్యం చెప్పే కేటీఆర్ ఇప్పుడు చేసిన పోస్ట్ చూసి అంతా ఎమోషనల్ అవుతున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. కేసీఆర్ మళ్లీ ఎప్పుడు మామూలుగా నడుస్తారు.. ఎప్పుడు స్టేజ్ ఎక్కి స్పీచ్‌లు ఇస్తారో చూడాలి మరి.