Congress: కాంగ్రెస్ హామీలు అమలు చేయించే బాధ్యత రాహుల్ గాంధీది: ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు
శనివారం ఆయన ముదిగొండ మండలం పండ్రేగి పల్లిలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక అభ్యర్థి.. భట్టిని గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు రుద్రరాజు కోరారు.
Congress: ఆరు గ్యారెంటీలు డిక్లరేషన్, మేనిఫెస్టో అంశాలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ అమలు చేయిస్తారని చెప్పారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు. శనివారం ఆయన ముదిగొండ మండలం పండ్రేగి పల్లిలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక అభ్యర్థి.. భట్టిని గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు రుద్రరాజు కోరారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడారు. ‘‘భట్టి విక్రమార్క గెలవడం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని రాహుల్ గాంధీ చెప్పారు.
ప్రతిపక్ష నేతగా, ప్రజల గొంతుకగా భట్టి విక్రమార్క అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గడగడలాడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర స్ఫూర్తితో చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడు విని, సామాజిక స్థితిగతులు తెలుసుకొని రాహుల్ గాంధీకి వివరించగా వచ్చినవే ఆరు గ్యారెంటీలు, నిన్న ప్రకటించిన కాంగ్రెస్ మేనిఫెస్టో. ప్రజా సమస్యల పరిష్కారానికి కావాల్సిన అన్ని అంశాలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరచడాని పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన స్పందనే కారణం. ఛత్తీస్‌గడ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రకటించిన హామీలను అమలు చేయించిన ఘనత రాహుల్ గాంధీది. తెలంగాణలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు డిక్లరేషన్, మేనిఫెస్టో అంశాలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ అమలు చేయిస్తారు.
యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ నేతృత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో రూ.72 వేల కోట్ల రైతు రుణాలు రద్దు చేసిన పార్టీ కాంగ్రెస్. రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2007లో భట్టి విక్రమార్క, నేను స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ కి ఆత్మీయులుగా, ఆప్తులుగా వారితో కలిసి పనిచేశాం. బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఒత్తిడిలు చేసిన గత మూడు పర్యాయలుగా భట్టి విక్రమార్క వెంట ఉన్నందుకు మధిర ప్రజలకు ధన్యవాదాలు.
గాంధీ కుటుంబానికి సన్నిహితులు, జాతీయస్థాయిలో పలుకుబడి కలిగిన విక్రమార్క రానున్న కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర కానున్నారు. ఉన్నత చదువులు చదువుకొని ప్రజాసేవకే అంకితమై 2007 నుంచి ఇప్పటివరకు మధిరను అభివృద్ధి చేస్తున్న భట్టి విక్రమార్కను గెలిపించుకుంటే నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు 20 రోజులు కష్టపడితే భట్టి విక్రమార్క మీ పెద్దకొడుకు లాగా ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేస్తారు”అని రుద్రురాజు అన్నారు.