ఇంకా తగ్గని గాయం, రెండో టెస్టుకు గిల్ డౌట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ గెలిచి జోష్ లో ఉన్న టీమిండియాకు బ్యాడ్ న్యూస్... యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ గెలిచి జోష్ లో ఉన్న టీమిండియాకు బ్యాడ్ న్యూస్… యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. సిరీస్ లోని రెండో టెస్టుకు కూడా టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వార్మప్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు తొలి టెస్టు ఆడలేకపోయాడు. వేలికి అయిన గాయం ఇంకా తగ్గలేదని.. దీంతో అతడు ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో జరిగే రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో ఆడే అవకాశం లేదని సమాచారం. అలాగే అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6వ తేదీ నుంచి జరగనున్న పింక్ బాల్ టెస్టుకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి.