గిల్ కు డిమోషన్, బుమ్రాకు ప్రమోషన్

కొత్త ఏడాదిలో భారత క్రికెట్ జట్టుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిలబెట్టుకోలేకపోయిన భారత్ ఇక వైట్ బాల్ క్రికెట్ పై ఫోకస్ పెట్టింది. స్వదేశంలో ఇంగ్లాండ్ తో సిరీస్ అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 7, 2025 | 03:05 PMLast Updated on: Jan 07, 2025 | 3:05 PM

Gill Gets Demoted Bumrah Gets Promoted

కొత్త ఏడాదిలో భారత క్రికెట్ జట్టుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిలబెట్టుకోలేకపోయిన భారత్ ఇక వైట్ బాల్ క్రికెట్ పై ఫోకస్ పెట్టింది. స్వదేశంలో ఇంగ్లాండ్ తో సిరీస్ అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో సెలక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వన్డే జట్టులో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు జస్ప్రీత్ బుమ్రాకు అప్పగిస్తారని సమాచారం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బూమ్రా అద్భుతంగా రాణించాడు. సిరీస్ మొత్తం ఒక్కడే బౌలింగ్ భారాన్ని సక్సెస్ ఫుల్ గా మోశాడు. 32 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఈ సిరీస్ మాత్రమే కాదు గత కొన్నేళ్ళుగా భారత్ విజయాల్లో బుమ్రాదే కీలకంగా ఉంది. అందుకే టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ, రోహిత్ తర్వాత వారసుడిగా జట్టు పగ్గాలను సైతం అప్పగించబోతున్నారు. ఇప్పుడు వన్డే ఫార్మాట్ కు కూడా బుమ్రా వైపే బీసీసీఐ మొగ్గుచూపుతోంది.

ఆసీస్‌తో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమిండియా కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచిందంటే కారణం బుమ్రానే. తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులో లేకపోవడంతో జట్టును సమర్థవంతంగా లీడ్ చేసిన బుమ్రా ఆసీస్‌ గడ్డపై టీమిండియాకు అతిపెద్ద టెస్టు విజయాన్ని అందించాడు. తర్వాత రోహిత్ శర్మ మూడు టెస్టుల్లో సారథిగా వ్యవహరించినా గెలుపును రుచిచూడలేకపోయింది. చివరికి తనంతట తాను సిడ్నీ టెస్టు నుంచి తప్పుకోవడంతో బుమ్రా మళ్ళీ పగ్గాలు అందుకున్నాడు. అదే సమయంలో వెన్నునొప్పితో తీవ్ర ఇబ్బందిపడిన బుమ్రా మ్యాచ్ మధ్యలో అర్థాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్, బెంగళూరు జాతీయ అకాడమీ ఆధ్వర్యంలో బుమ్రా పరిస్థితిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్ తో సిరీస్ కు అతను అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం ఈ స్టార్ పేసర్ తిరిగి రానున్నాడు.

కాగా ప్రస్తుతం వన్డేల్లో వైస్ కెప్టెన్ గా ఉన్న శుభ్ మన్ గిల్ కూడా పేలవ ఫామ్ లో ఉన్నాడు. అందుకే అతన్ని తప్పించి బుమ్రాకే వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని సెలక్టర్లు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టెస్టుల్లో పూర్తిస్థాయి కెప్టెన్ గా బుమ్రాకే బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ ఇంకా ఎన్నో రోజులు రెడ్ బాల్ క్రికెట్ ఆడకపోవచ్చు. ఈ నేపథ్యంలో బుమ్రాను మించిన ప్రత్యామ్నాయం కూడా బీసీసీఐకి కనిపించడం లేదు. అదే సమయంలో వన్డేల్లోనూ రోహిత్ వారసుడిగా కూడా అతన్నే కొనసాగిస్తారన్న వార్త కూడా ప్రచారంలో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాతే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.