బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ సారి స్టార్ ప్లేయర్స్ అందరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఆసీస్ గడ్డపై అద్భుతమైన రికార్డున్న విరాట్ కోహ్లీతో సహా రోహిత్ , గిల్, పంత్ నిరాశపరిచారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్నడూ లేని విధంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. వ్యక్తిగతంగా పేలవమైన ఫామ్ తో నిరాశపరిచాడు. అటు కెప్టెన్ గానూ ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా రోహిత్ రిటైర్మెంట్ టైమ్ వచ్చేసిందంటూ పలువురు మాజీలు, అభిమానులు ట్రోలింగ్ చేశారు. అయితే తన రిటైర్మెంట్ రోహిత్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాగా రోహిత్ శర్మ రిటైరయితే పెద్ద ఆశ్చర్యమేమీ లేదని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. శుభమన్ గిల్ లాంటి యువ క్రికెటర్లు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. టెస్టు కెరీర్‌పై రోహిత్ ఓ నిర్ణయం తీసుకుంటాడని, ఒకవేళ అతను రిటైర్ అయినా షాక్ అయ్యేది ఏమీ లేదన్నాడు. వయసు, ఫిట్ నెస్ , ఫామ్ ఈ మూడింటినీ పరిగణలోకి తీసుకుని చూస్తే రిటైర్మెంట్ కు ఇదే సరైన టైమ్ గా అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌తో సిరీస్‌లో రోహిత్ తన ఫీట్ మూమెంట్‌తో ఇబ్బందిపడినట్లు రవిశాస్త్రి తెలిపాడు.ఒకవేళ సిడ్నీ టెస్టులో ఆడితే, అప్పుడు రోహిత్ ప్రత్యర్థి బౌలర్లను టార్గెట్ చేసి పరుగుల వరద సృష్టించాలన్నాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ కారణంగానే గిల్ లాంటి ప్లేయర్ బెంచ్ పై కూర్చోవాల్సి వస్తోందంటూ వ్యాఖ్యావించాడు. శుభమన్ గిల్ గత ఏడాది 40 యావరేజ్‌తో బ్యాటింగ్ చేశాడని, అలాంటి ప్లేయర్ వృధాగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. నాణ్యమైన ఆటగాడు బెంచ్‌పై కూర్చోవడం ఆశ్చర్యపరుస్తోందన్నాడు. మరోవైపు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడానికి వచ్చిన రోహిత్ కాస్త భిన్నంగా కనిపించాడు. రోహిత్ ఎక్కువసేపు మైదానంలో ప్రాక్టీస్ చేయలేదు. జస్ప్రీత్ బుమ్రా, గంభీర్ లతో ఏదో సీరియస్ గా మాట్లాడడం మాట్లాడటం కనిపించింది. ఈ వీడియో తర్వాత రోహిత్ సిడ్నీ టెస్టులో ఆడడం డౌటేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. పైగా తుది జట్టులో రోహిత్ ఉన్నాడా అన్న ప్రశ్నకు గంభీర్ భిన్నంగా సమాధానమివ్వడం కూడా అనుమానాన్ని పెంచింది. పిచ్ ను పరిశీలించాకే తుది జట్టును ఖరారు చేస్తామంటూ గంభీర్ చెప్పాడు. ఒకవేళ రోహిత్ తప్పుకుంటే వైస్ కెప్టెన్ బుమ్రా జట్టును లీడ్ చేయనున్నాడు. పెర్త్ టెస్టులో బుమ్రా కెప్టెన్సీలోనే భారత్ మ్యాచ్ గెలిచింది.[embed]https://www.youtube.com/watch?v=X16P2GqYmXo[/embed]