మీదొక చెత్త క్రికెట్ బోర్డు, పీసీబీపై గిలెస్పీ ఫైర్

మైదానంలోనే కాదు అడ్మినిస్ట్రేషన్ లోనూ పాకిస్తాన్ ఎప్పుడెలా వ్యవహరిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు... అక్కడ జరిగినన్ని రాజకీయాలు, ట్విస్టులు మరెక్కడా జరగవు.. అసలు జట్టులో క్రికెటర్లనే కాదు సెలక్టర్లను, కోచ్ లను నెలకోసారి మార్చేస్తూ ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 17, 2024 | 12:12 PMLast Updated on: Dec 17, 2024 | 12:12 PM

Gillespie Fires Back At Pcb Says You Are A Rubbish Cricket Board

మైదానంలోనే కాదు అడ్మినిస్ట్రేషన్ లోనూ పాకిస్తాన్ ఎప్పుడెలా వ్యవహరిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు… అక్కడ జరిగినన్ని రాజకీయాలు, ట్విస్టులు మరెక్కడా జరగవు.. అసలు జట్టులో క్రికెటర్లనే కాదు సెలక్టర్లను, కోచ్ లను నెలకోసారి మార్చేస్తూ ఉంటుంది. అందుకే పాక్ క్రికెట్ బోర్డుతో కలిసి పనిచేయాలంటే విదేశీ ఆటగాళ్ళెవరూ ముందుకు రారు.. ఒకవేళ వచ్చినా ఒకటి రెండు నెలలు మించి అక్కడ ఉండలేరు.. గత కొంతకాలంగా ఆ జట్టుకు మారిన కోచ్ లు చాలా మందే ఉన్నారు. సౌతాఫ్రికా మాజీ క్రిికెటర్ గ్యారీ కిరిస్టెన్ కేవలం నాలుగు నెలలకే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, పాకిస్థాన్ క్రికెట్ ఆటగాళ్లలతో విబేధాలు రావడంతోనే కిరిస్టెన్ గుడ్ బై చెప్పేశాడు. తర్వాత అతని స్థానంలో బౌలింగ్ కోచ్ జాసన్ గిలెస్పీని పాక్ బోర్డు హెడ్ కోచ్ గా ఎంపిక చేసింది. రెండు నెలలకే గిలెస్పీ కూడా పాక్ క్రికెట్ కోచ్ గా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేసిన గిలెప్సీ తాజాగా పీసీబీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యాడు.

పీసీబీని ప్రపంచంలోనే అతి చెత్త క్రికెట్ బోర్డుగా అభివర్ణించాడు. పాక్ క్రికెట్ బోర్డు లాంటి బోర్డును త‌నకెక్క‌డా చూడ‌లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించాడు. కిరెస్టన్‌ వైదొలిగిన తర్వాత హెడ్ కోచ్‌గా వచ్చిన గిలెస్పీ ఆధ్వర్యంలోనే పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే పీసీబీతోనూ, సెలక్టర్లతోనూ గిలెస్పీకి తీవ్ర విభేదాలున్నట్టు తేలిపోయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. ఏ హెడ్ కోచ్ అయినా త‌మ బోర్డుతో మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటాడని, పీసీబీ తీరు మాత్రం దీనికి భిన్నమన్నాడు. తుది జ‌ట్టు ఎంపిక విష‌యంలో కూడా తనకు పూర్తి స్వేఛ్చ లేదన్నాడు. అందులో కూడా పీసీబీ జోక్యం చేసుకుంటుందన్నాడు. సెల‌క్ట‌ర్ల‌తో కూడా స‌రైన క‌మ్యూనికేష‌న్ లేదనీ. సీనియర్ అసిస్టెంట్ కోచ్ టిమ్ నీల్సన్‌ను నాకు కనీసం సమాచారం ఇవ్వకుండానే తప్పించారన్నాడు.

గ‌త కొన్ని నెల‌ల‌గా వారితో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా తాను కొనసాగానని చెప్పాడు. ఎప్పుడైతే నీల్స్‌ను కనీసం స‌మాచారం ఇవ్వ‌కుండా తొలిగించారో అప్పుడే గుడ్‌బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నట్టు గిల్లెస్పీ పేర్కొన్నాడు. కాగా గిలెస్పీ స్థానంలో పాక్ మాజీ క్రికెటర్ అకీబ్ జావెద్ ను పిసిబి తాత్కాలిక కోచ్ గా నియమించింది.