Mumbai Murder: ముంబైలో మానవమృగం.. ప్రియురాలిని చంపి కుక్కలకు ఆహారం..
యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత:.. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనేది ఆ మాటకు అర్థం. మన దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేవతలు కొలువై ఉన్నారు. కానీ స్త్రీలకు గౌరవం కాదు కదా.. మాన ప్రాణాలకు రక్షల లేకుండా పోయింది.

Mumbai Girl Friend Murder Case
ఇదే ఆఖరిది అనుకున్న ప్రతీ సారి.. దాన్ని మించిన దారుణ ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ముంబైలో ఓ కిరాతకుడు తన ప్రియురాలికి నరికి కుక్కలకు ఆహారంగా వేసిన వైనం దేశాన్ని దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. ముంబైలో ఉండే 56 సంవత్సరాల మనోజ్ సహాని ఓ 36 ఏళ్ల యువతితో కొంతకాలం నుంచి సహజీవనంలో ఉన్నాడు. వీళ్లిద్దరు కలిసి ముంబూ మిరా రోడ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్లు. రీసెంట్‌గా వీళ్లిద్దరి మధ్య ఓ విషయంలో గొడవ రావడంతో మనోజ్ సహానీ తీవ్ర ఆగ్రహానికి గురై తన ప్రియురాలిపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది.
పట్టరాని కోపంతో ప్రియరాలిని చంపి ముక్కలుగా చేశాడు మనోజ్ సహాని. చెట్లు కత్తిరించే రంపంతో ప్రియురాలి బాడీని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఇందులో కొన్ని ముక్కలను కుక్కర్‌లో వండి తాను పెంచుకుంటున్న కుక్కలకు వేసినట్టు పోలీసుల విచారణలో మనోజ్ చెప్పాడు. రెండు మూడు రోజుల నుంచి మనోజ్ ప్రియురాలు కనిపించకపోవడం, మనోజ్ ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా కనిపించడంతో చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు సమాచారమిచ్చారు.
మనోజ్ ఫ్లాట్‌కు వచ్చిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మనోజ్ తన ప్రియురాకి బాడీని 13 ముక్కలుగా నరికి 13 ప్లాస్టిక్ బ్యాగుల్లో ప్యాక్ చేసి పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఆ ముక్కలను స్వాధీనం చేసుకుని మనోజ్‌ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఓ వ్యక్తి తన ప్రియురాలి తల మొండెం వేరు చేసిన ఘటన మరువకముందే ఇలాంటి మరో దారుణం జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది.