Mahalakshmi scheme : ఆడాళ్ళూ.. ఫ్రీ అంటే మరీ ఇలాగా..! ఇక నుంచి బస్సులు అక్కడ ఆపరు

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటి నుంచి క్రేజ్ మామూలుగా లేదు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో 45 శాతం ఉన్న మహిళల ఆక్యుపెన్సీ.. ఇప్పుడు 75 శాతానికి పైగా పెరిగింది. ఆర్టీసీ బస్సుల్లోని సీట్లన్నీ మహిళలే ఆక్రమిస్తుండటంతో.. టిక్కెట్లు కొనుక్కున్న మగవాళ్ళు మాకు సీట్లేవని ప్రశ్నిస్తున్నారు. ఇక ఆడాళ్ళు కూడా ఫ్రీ బస్సే కదా అని ఎక్కడి పడితే అక్కడ ఎక్స్ ప్రెస్ బస్సులు ఆపుతున్నారట. దాంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 23, 2023 | 02:29 PMLast Updated on: Dec 23, 2023 | 2:29 PM

Girls Free Means So Much Buses Will Not Stop There From Now On

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటి నుంచి క్రేజ్ మామూలుగా లేదు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో 45 శాతం ఉన్న మహిళల ఆక్యుపెన్సీ.. ఇప్పుడు 75 శాతానికి పైగా పెరిగింది. ఆర్టీసీ బస్సుల్లోని సీట్లన్నీ మహిళలే ఆక్రమిస్తుండటంతో.. టిక్కెట్లు కొనుక్కున్న మగవాళ్ళు మాకు సీట్లేవని ప్రశ్నిస్తున్నారు. ఇక ఆడాళ్ళు కూడా ఫ్రీ బస్సే కదా అని ఎక్కడి పడితే అక్కడ ఎక్స్ ప్రెస్ బస్సులు ఆపుతున్నారట. దాంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.

మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సులన్నీ నిండిపోతున్నాయి. ఆర్టీసీకి ఆదాయం కూడా పెరిగినట్టు తెలుస్తోంది. కానీ బస్సుల్లో 90శాతం సీట్లను మహిళలే ఆక్రమిస్తుండటంతో.. డబ్బులు పెట్టి టిక్కెట్లు కొన్న మగవాళ్ళు విసుక్కుంటున్నారు. మాకు సీట్లు లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని 200 దాకా కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. వీటిల్లో ముందుగా 50 బస్సులను శనివారం నుంచే అందుబాటులోకి తెస్తామంటున్నారు.

ఫ్రీ బస్ స్కీమ్ ని మహిళలు ఇష్టమొచ్చినట్టు వాడుకోవడంపై ఆర్డీసీ ఎండీ సజ్జనార్ కొన్ని సూచనలు చేశారు. తక్కువ దూరం వెళ్ళాల్సిన మహిళా ప్రయాణీకులు కూడా ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. దాంతో దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి ఇబ్బంది కలుగుతోంది. అందువల్ల తక్కువ దూరం వెళ్ళేవారు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని సజ్జనార్ సూచించారు. అంతేకాదు.. కొందరు మహిళలు ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపుతున్నారు. బస్ స్టాప్స్ లో కాకుండా మధ్యలో ఆపి ఎక్కుతుండటంతో… బస్సు ప్రయాణ సమయం పెరిగిపోతోంది. అందుకే ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులు అనుమతించిన స్టేజీల్లోనే ఆగుతాయని ఎండీ సజ్జనార్ చెప్పారు.

తెలంగాణలో అమలవుతున్న మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ని.. ఆంధ్రప్రదేశ్ లోనూ పెట్టాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఏపీ అధికారులు సర్వే మొదలుపెట్టారట. తెలంగాణ, కర్ణాటకల్లో ఈ స్కీమ్ ఎలా అమలు చేస్తున్నారు.. ఆర్టీసీకి వచ్చే నష్టం ఎంత ? దాన్ని ఎలా భర్తీ చేయాలి.. ఏపీలో అమలు చేస్తే.. మహిళల సంఖ్య ఎంత వరకూ పెరిగే ఛాన్సుంది.. లాంటి అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్ అంటే.. ఆటోలు, క్యాబ్స్ డ్రైవర్ల ఉపాధి పరిస్థితి ఏంటి అన్నదానిపైనా జగన్ సర్కార్ స్టడీ చేస్తున్నట్టు సమాచారం.