CPI, Congress : లోక్ సభ ఎన్నికల్లో ఈ ఐదు స్థానాల్లో ఏదో ఒక స్థానం ఇవ్వండి.. కాంగ్రెస్ కు సీపీఐ డిమాండ్..!
తెలంగాణలో కాంగ్రెస్ (Congress) , సీపీఐ పార్టీలు (CPI Party) కలిసి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana assembly election) పోటీ చేసి విజయం సాధించాయి. వాటిలో ఖమ్మంలోని కొత్త గుండెం సీటు కాంగ్రెస్ పొత్తులో భాగంగా సీపీఐ గెలుచుకుంది. కాగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒక సీటు ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతోంది.

Give one of these five seats in the Lok Sabha elections.. CPI demands to Congress..!
తెలంగాణలో కాంగ్రెస్ (Congress) , సీపీఐ పార్టీలు (CPI Party) కలిసి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana assembly election) పోటీ చేసి విజయం సాధించాయి. వాటిలో ఖమ్మంలోని కొత్త గుండెం సీటు కాంగ్రెస్ పొత్తులో భాగంగా సీపీఐ గెలుచుకుంది. కాగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒక సీటు ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతోంది. సీపీఐ తమకు పట్టు ఉన్న ఐదు లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంది. ఈ మేరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, అజీజ్‌పాషా తదితరులు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో ఇటీవల సమావేశమయ్యారు. సీపీఐ ప్రతిపాధించిన ఐదు లోక్ సభ స్థానాల్లో (ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, వరంగల్, పెద్దపల్లి స్థానాల్లో) ఎదో ఒక స్థానం ఇవ్వాలని ప్రతిపాధన ఉంచారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ తరఫున సీట్ల సర్దుబాటు కమిటీ సభ్యుడు ముఖుల్ వాస్నిక్ కూడా పాల్గొన్నారు. ఈ విషయమై రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడాలని సీపీఐ నేతలకు ఖర్గే సూచించారు.
ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో ప్రస్తావించగా.. లోక్ సభ సీట్ల (Lok Sabha seats) కేటాయింపులు పూర్తిగా జాతీయ నాయకత్వం చేతుల్లోనే ఉంటుందని.. వారిదే తుది నిర్ణయం అని చెప్పారని వారు ఖర్గేకు వివరించారు. కాగా గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావు గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సీపీఐ సిట్టింగ్ MLA లోక్ సభ ఎన్నికల్లో కూడా ఖమ్మం ప్రజల మద్దతు తమ పార్టీకి ఉంటుందని.. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలనే ఆలోచనలో సీపీఐ ఉంది. కాగా జాతీయ నాయకత్వం ఖమ్మం సీటు ఇస్తుందా.. ఇవ్వదా.. అనేది వేచి చూడాలి.