JANASENA GLASS: జనసేనకే గాజు గ్లాసు.. హైకోర్టులో బిగ్ రిలీఫ్

ఫ్రీ సింబల్స్‌లో ఉన్న గ్లాసును తమకు కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో గాజు గ్లాసు గుర్తుపై జనసేన టెన్షన్ తీరిపోయింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ గాజు గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టులో సవాల్ చేయడంతో జనసైనికులు టెన్షన్ పడ్డారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2024 | 01:30 PMLast Updated on: Apr 16, 2024 | 1:30 PM

Glass Symbol Allotted To Janasena Big Reliefe For Pawan Kalyans Party

JANASENA GLASS: ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన పార్టీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఆ పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును రద్దు చేయాలన్న పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. ఫ్రీ సింబల్స్‌లో ఉన్న గ్లాసును తమకు కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో గాజు గ్లాసు గుర్తుపై జనసేన టెన్షన్ తీరిపోయింది.

Janhvi Kapoor: జాన్వీక‌పూర్ ఇంట అంబానీ పిల్ల‌లు.. రాయ‌ల్ పార్టీ ఇచ్చిన జాన్వీ

రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ గాజు గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టులో సవాల్ చేయడంతో జనసైనికులు టెన్షన్ పడ్డారు. ఒకవేళ గుర్తుపై నిర్ణయం తమకు వ్యతిరేకంగా వస్తే పరిస్థితి ఏంటి.. అప్పుడు ఈసీ వేరే ఏదైనా ఫ్రీ సింబల్ ఇస్తే ఎలా.. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో సింబల్ ఉంటుంది.. లేదంటే జనసేన అభ్యర్థులంతా.. టీడీపీ గుర్తు సైకిల్‌పై పోటీ చేయాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందారు. కానీ ఏపీ హైకోర్టు జనసేనకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. గాజు గ్లాసు గుర్తు గతంలో ఫ్రీ సింబల్స్‌లో ఉండేది. జనసేన రిక్వెస్ట్‌తో ఎలక్షన్ కమిషన్.. ఈ ఎన్నికల్లో దాన్ని ఆ పార్టీకే కేటాయించింది. అయితే ఫ్రీ సింబల్స్‌లో ఉన్న గాజు గ్లాసును జనసేనకు ఎలా ఇస్తారంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఏపీ హైకోర్టులో సవాల్ చేసింది. అలాగే ఆ గుర్తును తమకు కేటాయించేలా ఈసీని ఆదేశాలించాలని కూడా రెండో పిటిషన్ వేసింది.

దీనిపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ రెండు పిటిషన్లను తోసిపుచ్చింది. ఇప్పటికే జనసేనకు ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. అందువల్ల ఎన్నికల వేళ తాము జోక్యం చేసుకోలేమన్నది హైకోర్టు. ఏపీ హైకోర్టు తీర్పుతో జనసైనికుల్లో టెన్షన్ తొలగిపోయింది. ఈ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేయబోతున్నారు ఆ పార్టీ అభ్యర్థులు.