Glenn Maxwell: బెంగుళూరుకు ఎదురుదెబ్బ.. స్టార్ ఆల్ రౌండర్‌కు గాయం
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా మ్యాక్సీ కుడిచేతి బొటన వేలికి గాయమైనట్లు సమాచారం. దీంతో ఆర్సీబీ సన్‌రైజర్స్‌తో ఆడబోయే మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఆడటం అనుమానమేనని ఆ జట్టు వర్గాలు చెబుతున్నాయి.

Glenn Maxwell: ఐపీఎల్ సీజన్‌లో వరుస ఓటమలు ఎదుర్కొంటూ పాయింట్ల పట్టికలో తొమ్మిది స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు గాయమైనట్లు తెలుస్తుంది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా మ్యాక్సీ కుడిచేతి బొటన వేలికి గాయమైనట్లు సమాచారం. దీంతో ఆర్సీబీ సన్‌రైజర్స్‌తో ఆడబోయే మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఆడటం అనుమానమేనని ఆ జట్టు వర్గాలు చెబుతున్నాయి.
ROHIT SHARMA: రిటైర్మెంటా.. ఎవరు చెప్పారు..? 2027 వరల్డ్ కప్ కూడా ఆడతా..!
కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఈ సీజన్‌లో అతను ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు డకౌట్లు కూడా ఉన్నాయి. మ్యాక్స్‌వెల్ లేకపోతే వరుస ఓటమలు ఎదుర్కొంటున్న ఆర్సీబీ కష్టాలు మరింత ఎక్కువవుతాయి. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకే ఒక విజయం సాధించింది. ఆర్సీబీ తరఫున విరాట్ ఒక్కడే బాగా ఆడుతున్నాడు. జట్టులో మిగతా బ్యాట్లంతా కలిపి విరాట్ చేసినన్ని పరుగులు చేయలేదు. దీన్ని బట్టి చూస్తే ఆర్సీబీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్దమవుతుంది. ఆర్సీబీ బౌలింగ్ టీమ్ విషయానికొస్తే.. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త బౌలింగ్ టీమ్‌గా అభివర్ణిస్తున్నారు.