chiru- charan : తండ్రిని మించిన తనయుడు
టాలీవుడ్ హీరోలకు ఈమధ్య నార్త్‌లో ఫాలోయింగ్ బాగా పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు అక్కడ మంచి క్రేజ్ ఉంది. రామ మందిర ప్రారంభోత్సవం రోజున అది మరోసారి ప్రూవ్ అయింది. చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్ రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లిన తర్వాత చిరు, చరణ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఈ వేడుకకు ఆహ్వానం అందడం గొప్ప విషయం. దీన్ని గౌరవంగా భావిస్తున్నాము. ఆ దేవుడే మాకు ఆహ్వానం అందేలా చేశాడు’ అన్నారు.

Global star Ram Charan seems like a son who surpasses his father.
టాలీవుడ్ హీరోలకు ఈమధ్య నార్త్‌లో ఫాలోయింగ్ బాగా పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు అక్కడ మంచి క్రేజ్ ఉంది. రామ మందిర ప్రారంభోత్సవం రోజున అది మరోసారి ప్రూవ్ అయింది. చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్ రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లిన తర్వాత చిరు, చరణ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఈ వేడుకకు ఆహ్వానం అందడం గొప్ప విషయం. దీన్ని గౌరవంగా భావిస్తున్నాము. ఆ దేవుడే మాకు ఆహ్వానం అందేలా చేశాడు’ అన్నారు.
అయోధ్య వేడుకల్లో చిరు, చరణ్ అక్కడికి అతిథులతో మాట్లాడుతున్న క్రమంలో అనిల్ అంబానీ కూడా అక్కడికి వచ్చారు. ఆయనతో మాట్లాడుతున్న సమయంలో అక్కడి కెమెరామెన్‌లలో ఒకరు చిరంజీవి, రామ్‌చరణ్‌ల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడం గమనించిన మరో కెమెరామెన్ ‘ఎందుకు ఎక్కువ సేపు వాళ్లనే చూపిస్తున్నావ్.. ఆ ఫ్రేమ్‌లో ఎవరున్నారు’ అని ప్రశ్నించాడు. దానికి ఆ కెమెరామెన్ ‘అక్కడ రామ్‌చరణ్ ఉన్నాడు. పక్కనే అతని తండ్రి ఉన్నారు. అందుకే వారిపై ఫోకస్ పెట్టాను’ అంటున్న మాటలు అక్కడ వినిపించాయి. దీన్ని బట్టి రామ్‌చరణ్‌కి అక్కడ ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది.
టాలీవుడ్‌లో చిరంజీవి మెగాస్టార్. అతని పక్కనే రామ్‌చరణ్ ఉన్నప్పుడు సాధారణంగా చిరంజీవి కొడుకుగానే గుర్తింపు ఉంటుంది. కానీ, ఇక్కడ పూర్తిగా రివర్స్‌లో జరిగింది. చరణ్ తండ్రి చిరంజీవి అంటూ చెప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యపరచింది. తండ్రిని మించిన తనయుడు అంటే ఇదేనేమో అని అక్కడ ఉన్నవారు అనుకోవడం కూడా వినిపించింది. దీన్నిబట్టి చిరంజీవిని మించే స్థాయిలో చరణ్‌కి క్రేజ్ వచ్చిందని ఈ వీడియో ప్రూవ్ చేసిందని మెగా ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రామ్‌చరణ్‌కి నార్త్‌లో క్రేజ్ మామూలుగా లేదంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతూ వైరల్ చేసేస్తున్నారు అభిమానులు.