GOLD PRICE: తులం బంగారం రూ.71వేలు.. ఇప్పుడు కొనాలా.. వద్దా..?
పసిడి ధర ఆల్‌టైమ్ రికార్డులు నెలకొల్పుతోంది. దీంతో ఇటు జాతీయంగా అటు అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నాయి. గురువారం చెన్నైలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయలు పెరిగి 71 వేల 400 వందలకు చేరింది.
GOLD PRICE: బంగారం.. మధ్య తరగతి కుటుంబాలకు ఇక అందని ద్రాక్షేనా..? కొన్ని రోజులు గడిస్తే ఇక బంగారాన్ని చూడటం తప్ప కొనలేమా..? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సామాన్యుల్లో కలుగుతున్నాయి. ఎందుకంటే బంగారం రేటు రోజు రోజుకూ ఆకాశాన్ని చేరుతోంది. కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తామని యూస్ ఫెడ్ రిజర్వ్ ప్రకటనతో బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చేస్తున్నాయి. దీనికి తోడు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం నిల్వలు పెంచుకోవడంతో.. పసిడికి డిమాండ్ ఎక్కువైంది. ఫలితంగా అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
ORS DRINKS: ఓఆర్ఎస్‌గా ఫ్రూట్ జ్యూస్‌లు.. ప్రమాదకరం అంటున్న డాక్టర్లు
పసిడి ధర ఆల్‌టైమ్ రికార్డులు నెలకొల్పుతోంది. దీంతో ఇటు జాతీయంగా అటు అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నాయి. గురువారం చెన్నైలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయలు పెరిగి 71 వేల 400 వందలకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 450 రూపాయలు పెరిగి 65 వేల 450కి చేరింది. కిలో వెండి ధర 1300 వందలు పెరిగి 85 వేల 300 కి చేరింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కాస్త అటూ ఇటూగా ఇదే స్థాయిలో బంగారం రేట్లు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర 600 పెరిగి 70 వేల 470కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 500 పెరిగి 64 వేల 600కు రీచ్ అయ్యింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్‌లో కూడా బంగారం ధర దూసుకెళ్లింది. 24 క్యారెట్ల బంగారం ధర 70 వేల 275 వరకూ చేరింది. జూన్ నుంచి వడ్డీరేట్లు తగ్గుతాయన్న యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావల్ చేసిన ప్రకటనే బంగారం ధర పెరుగుదలకు కారణం అని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా వరుసగా ఆరు సెషన్లలో బంగారం ధర పరుగులు తీస్తోంది.
ఇంటర్నేటషన్ మార్కెట్‌లో ఒక ఔన్స్ బంగారం ధర 23 వందల డాలర్లకు చేరడం ఇదే మొదటిసారి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు 12 శాతం పెరిగియి. ఇప్పటి వరకూ మార్కెట్ గమనాన్ని పరిశీలిస్తే.. భవిష్యత్తులో కూడా రేట్ల పెరుగుతదల కొనసాగనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే నిజంగానే బంగారం మిడిల్‌క్లాస్‌కు అందని ద్రాక్షగానే మిగిలిపోయే ప్రమాదముంది.