GOLD PRICES: బంగారం రేటు లక్ష దాటబోతోందా..? రేట్ల పెరుగుదలకు కారణం ఇదే..!

గతేడాది ఇదే సమయంలో బంగారం ధర ప్రస్తుతంతో పోలిస్తే పది వేలు తక్కువగా ఉంది. దీంతో ఇప్పుడు పెరుగుతున్న బంగారం రేటును ఇక కంట్రోల్‌ చేయడం కష్టమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఏడాది చివరిలోగా 10 గ్రాముల బంగారం ధర 80 వేలు కూడా దాటే అవకాశం ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 3, 2024 | 08:13 PMLast Updated on: Apr 03, 2024 | 8:13 PM

Gold Prices Are Increasing Day By Day Will Reach Rs 1 Lakh Soon

GOLD PRICES: మార్కెట్‌లో బంగారం రేటు జట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. రోజు రోజుకూ పెరుగుతూ అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. ప్రస్తుతం ఇండియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర 71 వేలకు చేరింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజులో వెయ్యికి పైగా రేటు పెరిగింది. ఇక వెండిధర కూడా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం కిలో వెండి 78 వేల 6 వందలకు చేరింది. ఒక్కరోజులోనే 11 వందల 20 రూపాయలు పెరిగింది వెండి. గతేడాది ఇదే సమయంలో బంగారం ధర ప్రస్తుతంతో పోలిస్తే పది వేలు తక్కువగా ఉంది.

Thalapathy Vijay: 250 కోట్లా.. అయినా ప్రభాస్‌ని మించలేదా..?

దీంతో ఇప్పుడు పెరుగుతున్న బంగారం రేటును ఇక కంట్రోల్‌ చేయడం కష్టమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఏడాది చివరిలోగా 10 గ్రాముల బంగారం ధర 80 వేలు కూడా దాటే అవకాశం ఉంది అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం రేటు భగ్గుమంటోంది. ఔన్సు బంగారం ధర 0.6 శాతం పెరిగి 2 వేల 245 డాలర్లకు చేరింది. అమెరికాలో ద్రవ్యోల్బణ లెక్కలు అంచనాలకు తగినట్లుగానే ఉన్నాయి. జూన్‌ నుంచి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న అంచనాలకు ఈ ఇన్‌ఫ్లేషన్ లెక్కలతో మరింత బలం చేకూరింది. ఇలాంటి సిచ్యువేషన్‌లో మరోసారి ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఇక బంగారాన్ని ఫొటోల్లో చూసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ట్రంప్‌ గెలిస్తే వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది కాబట్టి.. బంగారం డిమాండ్‌ అమాంతం పెరుగుతుంది. సాధారణంగా డాలర్‌ బలంగా ఉండటం, బాండ్ల రాబడి బాగా ఉన్న సమయంలో బంగారం ధరలు కాస్త తగ్గాలి. కానీ ఈసారి మాత్రం ట్రెండ్‌ మారింది.

డాలర్‌ ఫైన్‌గా ఉన్నప్పటికీ బంగారం కూడా షైన్ అవుతోంది. మరోపక్క వడ్డీ రేట్లు పెరిగినా బంగారం ధర తగ్గడంలేదు. 2022లో బంగారం కేవలం 0.13 శాతమే తగ్గింది. కానీ 2023లో ఏకంగా 13.45శాతం పెరిగింది. దీంతో 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర లక్ష పైనే ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. దీంతో ఈ ఏడాది కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేశాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైనప్పటి నుంచి బంగారం కొనుగోళ్లు పెరిగాయి. కేవలం చైనా మాత్రమే 225 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. భవిష్యత్తులో బంగారానికి ఉండబోతున్న డిమాండ్‌ దృష్యానే దేశాలు ఈ స్థాయిలో కొనుగోలు చేస్తున్నాయంటున్నారు. పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోతున్న బంగారం రేటు ఏ స్థాయికి వెళ్లి ఆగుతుందో చూడాలి మరి.