GOLD PRICES: పసిడి పరుగు.. మిడిల్‌ క్లాస్‌కు బంగారం ఇక కలేనా..?

2023 ఏప్రిల్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 55 వేల 950 ఉంది. కానీ ఇప్పుడు 64 వేల 720 కి చేరింది. అదే 24 క్యారెట్ల బంగారం ధర 2023 ఏప్రిల్‌లో 10 గ్రాములకు 61 వేల 40 రూపాయలు ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా 70 వేల 830కి చేరింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 4, 2024 | 03:11 PMLast Updated on: Apr 04, 2024 | 3:11 PM

Gold Prices Continue To Rise For Fourth Straight Day Silver Surges To 2 Year High

GOLD PRICES: పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. రోజుకో రికార్డును బద్దలు కొడుతూ.. అందనంత ఎత్తుకు ఎదుగుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రేటు 71 వేలకు చేరింది. గతేడాదితో కంపేర్‌ చేస్తే బంగారం రేట్లు భారీగా పెరిగాయి. 2023 ఏప్రిల్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 55 వేల 950 ఉంది. కానీ ఇప్పుడు 64 వేల 720 కి చేరింది. అదే 24 క్యారెట్ల బంగారం ధర 2023 ఏప్రిల్‌లో 10 గ్రాములకు 61 వేల 40 రూపాయలు ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా 70 వేల 830కి చేరింది.

Forbes Richest List 2024: ఫోర్బ్స్ సంపన్నుల జాబితా విడుదల.. టాప్-10లో అంబానీ.. అదానీ స్థానం ఎంతంటే..

ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో కూడా బంగారానికి ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం ఒక ఔన్సు బంగారం ధర 0.6 శాతం పెరిగి 2 వేల 245 డాలర్లకు చేరింది. ఇక యూఎస్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ అయితే.. ఏకంగా 1.8 శాతం పెరిగి 2 వేల 279 డాలర్లు దాటేసింది. అమెరికాలో ఇన్‌ఫ్లేషన్‌, జూన్‌ నుంచి ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లు తగ్గిస్తారన్న అంచనాలతో బంగారానికి డిమాండ్‌ అమాంతం పెరిగింది. ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగిదే పెట్టుబడి సాధనంగా చాలా మంది బంగారాన్నే ఎంచుకుంటారు. దీంతో ఆటోమేటిక్‌గా బంగారం రేటు ఆకాశాన్ని చేరుతుంది. దీనికి తోడు అమెరికా జాబ్‌ మార్కెట్‌ లెక్కలు కూడా పాజిటివ్‌గా వస్తే మాత్రం పసిడిని పట్టుకోవడం కాస్త కష్టమే. సాధారణంగా డాలర్‌ బలంగా ఉండటం, బాండ్ల రాబడి బాగా ఉన్న సమయంలో బంగారం ధరలు కాస్త తగ్గాలి. కానీ ఈసారి మాత్రం ట్రెండ్‌ మారింది. డాలర్‌ ఫైన్‌గా ఉన్నప్పటికీ బంగారం కూడా షైన్ అవుతోంది. సాధారణంగా వడ్డీరేట్లు ఎక్కువగా ఉన్న సమయంలో బంగారం భారీగా తగ్గుతుంది. కానీ కోవిడ్ తర్వాత వడ్డీరేట్లు సెంట్రల్‌ బ్యాంకులు పెంచేసినా బంగారం మాత్రం దాన్ని తట్టుకుని నిలబడింది.

ఈ ఏడాది కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేశాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైనప్పటి నుంచి బంగారం కొనుగోళ్లు పెరిగాయి. 2022 లో కేంద్ర బ్యాంకులు వెయ్యి 81 టన్నుల బంగారం కొన్నాయి. ఇక 2023 లో మరో వెయ్యి 37 టన్నులు సేకరించాయి. 2023 లో చైనా 225 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. పోలెండ్ 130 టన్నులు, భారత్‌ 16 టన్నులు కొనుగోలు చేసింది. ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ట్రంప్‌ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే మాత్రం చైనాతో వివాదం కంటిన్యూ అవుతుంది. ఇటు డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి చైనా బంగారంపై ఫోకస్‌ పెట్టే అవకాశం ఉంది. దీంతో మొత్తంగా చూస్తే పసిడిని ఈ ఏడాది పట్టుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. కొన్నేళ్లుగా బంగారం రేట్ల పెరుగుదలలో ట్రెండ్‌ గమనిస్తే భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1970లో 10 గ్రాముల ధర 184 రూపాయలు ఉంటే.. 1980 వెయ్యి 330 రూపాయలకు చేరింది.

1990లో 3 వేల 2వందలు.. 2000 సంవత్సరంలో 4 వేల 4 వందలు. 2010లో 18 వేల 5 వందలు. 2020 లో 48 వేల 651 చేరింది. ప్రస్తుతం ఏకంగా 70 వేలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే.. 2025 ఏప్రిల్‌ నాటికి 10 గ్రామలు బంగారం ధర 81 వేల 185కు చేరే అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. 2026 నాటికి 89 వేల 353, 2027 నాటికి 97 వేల 268, 2028 నాటికి 96 వేల 907 పెరిగే ఛాన్స్‌ ఉందని చెప్తున్నారు. ఒకవేళ అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లు తగ్గించకపోతే మాత్రం బంగారం కాస్త తగ్గే అవకాశం ఉంది. అది కూడా భారీగా ఉండకపోవొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ లెక్కన ఎలా చూసినా.. అంతర్జాతీయ పరిణామాల్లో అలజడి ఉన్నంతకాలం బంగారం దూకుడును మాత్రం ఆపడం కష్టంగానే కనిపిస్తోంది.