GOLD PRICES: మండిపోతున్న బంగారం.. తులం బంగారం ధర ఎంత పెరిగిందంటే..
చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయికి చేరింది బంగారం ధర. 24 క్యారెట్ల బంగారం 70 వేల మార్క్‌ను దాటి జీవితకాల గరిష్ఠానికి చేరించి. దేశ వ్యాప్తంగా యావరేజ్‌గా మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారంపై 850 ధర పెరిగింది. దీంతో తులం 63 వేల 600కి చేరింది.
GOLD PRICES: మార్కెట్‌లో రోజు రోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా రోజు రోజుకూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇక ఇప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయికి చేరింది బంగారం ధర. 24 క్యారెట్ల బంగారం 70 వేల మార్క్‌ను దాటి జీవితకాల గరిష్ఠానికి చేరించి. దేశ వ్యాప్తంగా యావరేజ్‌గా మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారంపై 850 ధర పెరిగింది.
Pooja Hegde: రెబల్ స్టార్ కరుణించాడు.. లక్కీ పూజా..
దీంతో తులం 63 వేల 600కి చేరింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్‌పై ధర 930 పెరిగి.. తులం 69 వేల 380కి చేరింది. దేశం మొత్తంలో చెన్నైలో బంగారానికి అత్యధిక ధరలు ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర 70 వేల 420 కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 64 వేల 550కి చేరింది. దేశం మొత్తంలో ఇప్పుడు ఇదే టాప్. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం ఔన్స్‌కు రికార్డు స్థాయిలో 2 వేల 281 డాలర్లకు చేరింది. ట్రేడింగ్.. ఔన్స్‌కు దాదాపు 2 వేల 233 డాలర్ల వద్ద ప్రారంభం కాగా.. తక్కువ సమయంలో రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఓపెనింగ్ సెషన్‌లోనే పసిడి రికార్డు స్థాయికి చేరుకున్నది.
ఎంసీఎక్స్‌లో గోల్డ్ తులానికి 69 వేల 487 చేరుకుంది. ఇప్పటి వరకు బంగారం ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 63 వేల 750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 69 వేల 530కి చేరింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ 63 వేల 600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి 69 వేల 380కి దూసుకెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోపక్క వెండి ధర సైతం పెరిగింది. ప్రస్తుతం వెండి ధర 6 వందలు పెరిగి.. కిలో ధర 78 వేల 6 వందలకు చేరింది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి 81 వేల 600కి పెరిగింది.