బంగారం ధరలు భారీగా తగ్గినయ్ !
పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు ఇవాళ (5.12.23) తగ్గాయి. హైదరాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ ఈ రేట్లు అందుబాటులో ఉన్నాయి.

Gold Rates Down: పెళ్ళిళ్ళ సీజన్ లో బంగారం ప్రియులకు మంచి శుభవార్త. బంగారం ధరలు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్ బాగా డౌన్ అయింది.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1090 తగ్గింది. ఇప్పుడు రూ.63,110లకు చేరింది
ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.1000 తగ్గి రూ.57,850గా ఉంది.
వెండి సంగతి చూస్తే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.81.40 గా, 8 గ్రాముల వెండి ధర రూ.651.20 గా ఉంది. అలాగే 10 గ్రాముల వెండి ధర రూ.814 గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ (5.12.23) 10 గ్రాముల వెండి ధర రూ.21 వరకూ తగ్గింది. హైదరాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కంటిన్యూ అవుతున్నాయి.