సర్ఫరాజ్ తమ్ముడికి గోల్డెన్ ఛాన్స్, తొలిసారి ఐపీఎల్ లోకి ముషీర్ ఖాన్
జెడ్డా వేదికగా ఐపీఎల్ వేలంలో ఈసారి 182 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా కొంతమంది స్టార్ ప్లేయర్స్ కు ఫ్రాంచైజీలు షాకిచ్చాయి. టీమిండియాలో చోటు దక్కించుకున్న యువ బ్యాటర్ సర్పరాజ్ ఖాన్ ఐపీఎల్ లో అమ్ముడుపోలేదు.సర్ఫరాజ్ ఖాన్ బేస్ ధర 75 లక్షలు మాత్రమే.
జెడ్డా వేదికగా ఐపీఎల్ వేలంలో ఈసారి 182 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా కొంతమంది స్టార్ ప్లేయర్స్ కు ఫ్రాంచైజీలు షాకిచ్చాయి. టీమిండియాలో చోటు దక్కించుకున్న యువ బ్యాటర్ సర్పరాజ్ ఖాన్ ఐపీఎల్ లో అమ్ముడుపోలేదు.సర్ఫరాజ్ ఖాన్ బేస్ ధర 75 లక్షలు మాత్రమే. అయినప్పటికీ అతడిని కొనేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు. టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్న సర్పరాజ్ ను ఫ్రాంచైజీలు పోటీ పడి మరీ దక్కించుకుంటాయని అంతా భావించారు. అయితే ఈ సారి వేలంలో ఊహించని ప్లేయర్లను కొనుగోలు చేయడం జరిగింది.
సర్ఫరాజ్ చివరిసారిగా 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. అతని ఐపీఎల్ కెరీర్ చూస్తే సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్ సత్తా చాటలేకపోయాడు. మూడు సీజన్లు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు.కానీ ఆర్సీబీ అంచనాలను అందుకోలేకపోయాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ మరియు తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడాడు. ఇప్పటి వరకు 50 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 585 పరుగులు చేశాడు. మరోవైపు అతని తమ్ముడు ముషీర్ ఖాన్‌కు తొలిసారి ఐపీఎల్‌లో ఆడే అవకాశం లభించింది. పంజాబ్ కింగ్స్ ముషీర్‌ను అతని ప్రాథమిక ధర 30 లక్షలకు కొనుగోలు చేసింది. ముషీర్ ఆల్ రౌండర్. దేశీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. బ్యాటింగ్‌తో పాటు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్ మరియు యుజ్వేంద్ర చాహల్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ళున్నారు. దీంతో ముషీర్ ఖాన్ వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు.
ముషీర్ ఖాన్ ఇప్పటి వరకు ముంబై తరఫున టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా అతని రికార్డు బాగానే ఉంది. 9 మ్యాచ్‌లలో 51 సగటుతో 716 పరుగులు చేశాడు మరియు 8 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఐపీఎల్‌లో ముషీర్ ఎంపిక అతని కుటుంబం మరియు అభిమానులలో కొత్త ఆశను నింపింది. ముషీర్‌కు తనని తాను నిరూపించుకునే గొప్ప అవకాశం ఉంది. ముషీర్ ఐపీఎల్‌లో రాణిస్తే అతని భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనడంలో సందేహమే లేదు.