దాదాపు వారం రోజుల నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కోయి కోయి అని ఒకటే మ్యూజిక్కు. అసలు ఎటు నుంచి ఇంటర్నెట్‌లో ఎంటర్ అయ్యాడో తెలియదు కానీ.. రెండు రోజుల్లో మొత్తం సోషల్ మీడియాను దున్ని పడేశాడు. ఇంటర్నెట్‌లో ఈ పాటను చూసి చూసి.. చాలా మంది వాళ్లకు తెలియకుండానే వర్క్ ప్లేస్‌లో కోయ్‌కోయ్ అంటూ పాటలు పాడుతున్నారు. వారం రోజుల్లోనే సోషల్ మీడియాను పిచ్చెక్కించిన ఈ పాస్టర్ ఫ్లాష్‌బ్యాక్ మాత్రం చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. క్రీస్తుదాసుగా పేరు మార్చుకున్న ఈ పాస్టర్ అసలు పేరు మీసాల గురవప్ప. అంతా గుర్రప్పా అని పిలుస్తారు. భద్రాచలం దగ్గరి ఓ గోండు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతను. ప్రపంచంతో సంబంధం లేకుండా అడవుల్లో బతికే జాతి వీళ్లది. వీళ్లు మాట్లాడే భాష కూడా గోండు జాతికి చెందిన ఓ భాష. ఆ భాషలోనే గుర్రప్ప కోయ్ కోయ్ పాట రాశాడు. గురవప్ప పుట్టినప్పుడే అతని తల్లి చనిపోయింది. అతని తండ్రి ఆంబోతు వెంకన్న గురవప్పను పెంచి పెద్ద చేశారు. వెకన్న ఓ మంత్రగాడు. బయటి ప్రాంతాలకు వెళ్లి చోరీలు చేసి అడవుల్లో తలదాచుకునేవాడు. వాళ్ల దోపిడీ ముఠాకు కాపలా ఉండేందుకు కొడుకును విషపు మనిషిగా మార్చాడు వెంకన్న. చిన్నప్పటి నుంచే గురవప్పకు పాము విషం ఇవ్వడం ప్రారంభించాడు. అలా పెరుగుతున్నకొద్దీ గురవప్ప శరీరం పూర్తిగా విషంతో నిండిపోయింది. గురవప్ప ఎవరిని కరిచినా వాళ్లు చనిపోయేవాళ్లు. ఆంబోతు వెంకన్న గ్యాంగ్ చోరీ చేయడానికి వెళ్లినప్పుడు ఎవరైనా వాళ్ల మీద ఎటాక్ చేస్తే వాళ్లను చంపడానికి గురవప్పను వాడేవాళ్లు. ఇలాగే విషపు మనిషిగా కొనసాగుతున్న సమయంలో.. ఒకానొక స్టేజ్‌లో గురవప్ప ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో గురవప్ప బాడీ నుంచి విషాన్ని తీసేయడానికి వెంకన్న ట్రై చేశాడు. కానీ సాధ్యం కాలేదు. తనకు తెలిసి తాంత్రిక విద్యలు కూడా ట్రై చేశాడు. కానీ ఎలాంటి యూజ్ లేదు. ఆఖరికి డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. దీంతో గురవప్ప మళ్లీ తిరిగి అడవిలోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత తాను ఒక రోజు అడవిలో ఉన్న సమయంలో ఓ దేవ దూత తన దగ్గరకు వచ్చిందని.. ఆ తరువాత క్రమంగా తన శరీరంలోని విషం పోయి మామూలు వ్యక్తిగా మారిపోయాను అని గుర్రప్ప చెప్తున్నాడు. అప్పుడు గురవప్పగా ఉన్న తన పేరును క్రీస్తుదాసుగా మార్చుకుని దైవ సేవ చేయడం ప్రారంభించానని చెప్తున్నాడు గురవప్ప. దాదాపు పదేళ్ల నుంచి గురవప్ప దైవ సేవ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో మీటింగ్స్ పెడుతూ తిరుగుతున్నాడు. కానీ రీసెంట్‌గా ఆయన పాడిన పాట వైరల్ అవ్వడంతో అందరికీ ఆయన తెలిసాడు. చిరంజీవి హీరోగా వచ్చిన పున్నమినాగు అనే సినిమా కూడా తన జీవితం ఆధారంగానే తీశారనేది గుర్రప్ప చెప్తున్న పాయింట్. విషం శరీరంలో ఎక్కించుకున్న మనిషిగా తనకు గిన్నిస్ రికార్డ్ కూడా ఉందని గుర్రప్ప చెతప్తున్నాడు. తనతో పాటు మరో ఆగురుగు వ్యక్తులు కూడా ఇలా విషం ఎక్కించుకున్నారట. కానీ అందులో ఆరుగురు చనిపోయిం గుర్రప్ప మాత్రమే ఇంకా బతికి ఉన్నాడట. ఇందులో ఎంత వరకూ నిజం ఎంత వరకూ అబద్ధం అనేది మాతో పాటూ చాలా మందికి తెలియదు. ఎందుకంటూ ఇదంతా గుర్రప్ప తన నోటితో చెప్తున్నాడు కానీ ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవు. సో ఇదీ వారం రోజుల్లో సోషల్ మీడియాను షేక్ చేసిన కోయ పాస్టర్ గుర్రప్ప అసలు కథ.[embed]https://www.youtube.com/watch?v=nohOj71n9k4[/embed]