Mumbai Indians, Rohit Sharma : మాజీ కెప్టెన్ కు గుడ్ బై.. ముంబై ఇండియన్స్ రిటైన్ లిస్ట్ ఇదే
ఐపీఎల్ (IPL) మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు బీసీసీఐ (BCCI) తో సమావేశమై పలు డిమాండ్లు ఉంచాయి. అదే సమయంలో తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ళ జాబితాను రెడీ చేయడంలో బిజీబిజీగా ఉన్నాయి.
ఐపీఎల్ (IPL) మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు బీసీసీఐ (BCCI) తో సమావేశమై పలు డిమాండ్లు ఉంచాయి. అదే సమయంలో తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ళ జాబితాను రెడీ చేయడంలో బిజీబిజీగా ఉన్నాయి. ప్రస్తుతం రిటైన్షన్ జాబితా రూల్స్ మార్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ముంబై ఇండియన్స్ ఐదుగురు కీలక ఆటగాళ్ళను తమతో పాటే ఉంచుకోనుంది. వీరిలో మాజీ కెప్టెన్ (Former Indian captain) రోహిత్ శర్మ (Rohit Sharma) లేకపోవడం ఒకవిధంగా ఆశ్చర్యమే… మరోవిధంగా హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఊహించిందే..ఎందుకంటే రోహిత్ ను తప్పించి గత సీజన్ లో హార్థిక్ పాండ్యా (Hardik Pandya) ను తెచ్చుకున్న ముంబై ఎదుర్కొన్న ట్రోలింగ్ అంతా ఇంత కాదు. దీనికి తోడు పేలవ ప్రదర్శనతో మరిన్ని విమర్శల పాలైంది.
అయితే ఫ్రాంచైజీ తీరుపై పైకి చెప్పకున్నా రోహిత్ అసంతృప్తితో ఉండడం, జట్టును వీడేందుకు సిధ్ధమవుతున్నట్టు సమాచారం. ఇదిలా ముంబై ఉంటే రిటైన్ చేసుకునే జాబితాలో హార్థిక్ పాండ్యా పేరు ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. పాండ్యా కెప్టెన్సీ (Pandya’s captaincy) లో జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉన్నప్పటికీ, ఫ్రాంచైజీ అతనికి మరో అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. అలాగే ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రాను కూడా రిటైన్ చేసుకోవడం ఖాయం. ఇక ముంబై జట్టు బ్యాటింగ్ కు వెన్నెముకగా ఉన్న మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ను కూడా ముంబై కొనసాగిస్తుందని చెప్పొచ్చు.
వీరి తర్వాత టీ20 ఫార్మాట్‌లో ప్రమాదకరమైన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ డేవిడ్ ను కూడా రిటైన్ చేసుకుంటుందని అంచనా. మిగిలిన వారిలో ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషార, సఫారీ పేసర్ కొయెట్జీలలో ఒకరిని ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే అవకాశముంది.